ఇంటి గుట్టు బయటపెట్టిన చిరు!

మెగాస్టార్ చిరంజీవికి ఈ సంక్రాంతి పండుగ ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది.. పండుగ నాడు డబుల్ ధమాకాలా చిరు ఖైదీ నంబర్ 150 భారీ హిట్ సాధించింది.. ఆ ఉత్సాహంలోనే చిరంజీవి చాలా హ్యాపీగా పండుగ జరుపుకున్నారు. అంతేకాదు ఫ్యామీలీ ప్యాకేజ్ లా చిరు తన 150 వ సినిమా ఖైదీపై సినిమా మొదలు కావడానికి.. ఎలా స్టార్ట్ అయ్యింది. ఎవరినీ తీసుకున్నాం.. ఎలా షూటింగ్ జరిపామో లాంటి సినిమా ముందటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.. ఈ సందర్భంగా చిరు తన తమ్ముడి కూతురు హీరోయిన్ కం యాంకర్ నిహారికతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులోనే చిరుతో పాటు వినాయక్, రాంచరణ్ లను ప్రశ్నించింది నిహారిక.. ఈ సందర్భంగా చాలా ఇంట్రస్టింగ్ విషయాలను చిరు మనతో పంచుకున్నారు..

చిరంజీవి మాట్లాడుతూ.. ‘తాను తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా దర్శకుడు, ఇతర నిపుణులు తనకు చెప్పడానికి భయపడేవారని.. కానీ నా భార్య సురేఖ మాత్రం మొహం మీద కొట్టినట్టే ఇది బాలేదు అని చెప్పేదని’ వివరించారు.. తాను వేసుకున్న షర్ట్ సైతం బాగా లేదని నిర్మొహమాటంగా చెప్పేదన్నారు.. అందుకే తాను 150 వ సినిమా హీరోయిన్ విషయంలో కాజల్ ను సెలక్ట్ చేసుకున్నప్పుడు అది మంచి జోడి కాదు అని లోపల అనుకున్నానని తెలిపారు. కాజల్ .. పవన్, రాంచరణ్, బన్నీతో ఆడిపాడిందని.. తన లాంటి ఓల్డ్ ఏజ్ గ్రూప్ హీరోతో సూట్ అవుతుందా లేదో అని సంశయపడుతుంటే.. సురేఖ ఫస్ట్ స్టిల్ చూసి కాజల్ చిరు పక్కన సూట్ అయ్యిందని చిరు చెప్పారు.. ఆ తరువాతే చిరంజీవి కాజల్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కాజల్ కాకుంటే అనుష్కను పెడదామని అనుకున్నా డేట్స్ కుదరక కాజల్ నే చివరకు హీరోయిన్ గా అనుకున్నారట.. అదీ అలా చిరు తన ఇంట్లో పర్సనల్ గా సురేఖ ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంటర్వ్యూను కింద చూడొచ్చు…

To Top

Send this to a friend