ఇంటర్వ్యూల్లో హీరోయిన్ తో బాలయ్య చిలిపిచేష్టలు..

నటసింహం బాలయ్య తాను సినిమాల్లోనే కాదు.. బయటా మాంచి రసపురుషుడినే అని నిరూపించుకున్నారు.. సినిమాల్లో బాలయ్య హీరోయిన్లను గిల్లడం.. ఆటపట్టించడం స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు తెర ముందు బయట కూడా బాలయ్య అలానే ఉండి అలరిస్తున్నాడు.. ఆ మధ్య అమ్మాయిలు అలా ఉంటే అబ్బాయిలు రెచ్చిపోరా అంటూ పరుష వ్యాఖ్యలు చేసి బుక్కయిన బాలయ్య ఆ తర్వాత సారీ చెప్పి ఆ వివాదాన్ని అక్కడితో సమసిపోయేలా చేశారు. ఇప్పుడు గౌతమపుత్ర శాతకర్ణి సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య, క్రిష్, హీరోయిన్ శ్రియ కలిసి వివిధ చానాళ్లు, టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓకే సీటులో కూర్చున్న బాలయ్య-శ్రియాలు సందడిచేశారు. సినిమా పాటల విషయం రాగానే బాలయ్య సీట్లోనే డ్యాన్సులు చేస్తూ శ్రియాను కొట్టడం.. గిల్లడం.. తడపడం చేశాడు. బాలయ్య రోమాన్స్ సినిమాల్లోనే కాదు.. బయట కూడా చూసి ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకోగా.. విమర్శకులు మాత్రం ఎమ్మెల్యే అయ్యిండి ఇలా తోటి వారితో చేసే ప్రవర్తన ఇదా అని ప్రశ్నిస్తున్నారు..

బాలయ్య శ్రియాతో సరదా ఇంటర్వ్యూ వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend