ఇంగ్లాండ్ ఓటమికి.. భారత్ గెలుపుకు మధ్య అతడొక్కడే.

ఏమా మ్యాచ్.. ఎక్కడైనా బ్యాట్స్ మెన్, పరుగుల మీద దృష్టి ఉంటుంది. మ్యాచ్ ఇన్ని బంతుల్లో ఇన్ని పరుగులు చేయాలకుంటున్నప్పుడు అందరి ఓటు బ్యాటింగ్ చేస్తున్న జట్టుదే విజయం అని అంటారు. కానీ ఆదివారం ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్ అభిమానులకు ఎక్కడ లేని వినోదాన్ని పంచింది. క్రీజులో దిగ్గజ బ్యాట్స్ మెన్ ఉన్న కూడా ఇంగ్లండ్ చివరి ఓవర్ 6 బంతుల్లో కేవలం 8 పరుగులే చేయాల్సి ఉన్నా విజయం కళ్లముందే ఉన్న ఓడిపోయింది. ఇంగ్లండ్ ఓటమికి.. భారత్ విజయానికి మధ్య ఒకే ఒక్కడు అడ్డుగా నిలిచాడు.. అతడే భారత్ ఏస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా..

ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీట్వంటీ పోరులో భారత్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.. కోహ్లీ, యువీ, రైనా, ధోనీ, పాండ్ల, రాహుల్ లాంటి దిగ్గజ టీ ట్వంటీ ప్లేయర్లున్నా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 20 ఓవర్లలో 144 పరుగులే చేసింది. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల మంచి ఆటగాళ్లున్న ఇంగ్లండ్ కు ఈ లక్ష్యం పెద్దది కాదని.. ఇండియా ఓటమి అనుకున్నారంతా.. కానీ జస్ ప్రీత్ బూమ్రా ఖచ్చితంగా భారత్ ను గెలిపించారు. చివరి నాలుగు ఓవర్లలో 17 వ ఓవర్ వేసిన బూమ్రా కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన సీనియర్ నెహ్రా 16 పరుగులు ఇచ్చి భారత్ ను ఓటమి ముంగిట నిలిపాడు. దీంతో చివరి ఓవర్ వేసిన బూమ్రా అద్భుతమే సృష్టించాడు. క్రీజులో ప్రమాదకర రూట్, బట్లర్ లు క్రీజుల్లో ఉన్న చివరి ఆరు బంతుల్లో కేవలం 8 పరుగులే చేస్తే ఇంగ్లండ్ జట్టు గెలిచే అవకాశమున్నా రెండు వికెట్లు తీసి రెండే పరుగులు ఇఛ్చి బూమ్రా భారత్ ను గెలిపించాడు. అద్బుతంగా బౌలింగ్ చేసి ఇండియాను గెలిపించిన బ్రూమాకే ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు ఇవ్వడం విశేషం..

To Top

Send this to a friend