ఆ రేప్ బయటకొచ్చింది.. ఇక్కడ రాలేదు..


‘కేరళలో ఓ హీరోయిన్ కిడ్నాప్ రేప్ జరిగింది.. ఆమె బయటకు రాబట్టి విషయం వెలుగుచూసింది.. బాలీవుడ్ లో ఇంకా ఏ వుడ్ లోనైనా ఇలాంటివి కామన్.. అక్కడ బయటకు వచ్చింది.. ఇక్కడ రాలేదు అంతే తేడా’.. అని కుండబద్దలు కొట్టింది హాట్ బ్యూటీ కంగనా రౌనత్.. ఇటీవల హాట్ హాట్ సినిమాల్లో మరీ శృంగారభరితంగా నటిస్తున్న ఈ అమ్ముడు మీడియా ముందు కూడా అంతే దూకుడుగా బోల్డ్ గా మాట్లాడుతూ వార్తల్లో నిలుతోంది..
కొన్ని రోజుల క్రితం కంగనా వ్యాఖ్యలు కలకలం రేపాయి.. రంగూన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన కంగనా.. అందులో పలు వివాదాస్పద అంశాలను గుర్తు చేసి బాలీవుడ్ పరిశ్రమనే గందరగోళంలో పడేసింది.. తాను కొత్తగా బాలీవుడ్ లోకి వచ్చినప్పుడు బాలీవుడ్ హీరోలందరూ తనను వాడుకున్నారని.. ఇప్పుడు కూడా కొత్త హీరోయిన్స్ ను బాలీవుడ్ హీరోలు, దర్శకులు వాడుకుంటున్నారని.. అలాగైతేనే సినిమాల్లో అవకాశం ఇస్తామని కొత్త హీరోయిన్స్ ను ప్రలోభ పెడుతున్నారని కంగనా అరోపించారు.
ఇప్పుడు ఏకంగా మళయాలంలో ఓ హీరోయిన్ పై జరిగిన రేప్ కంగనా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. మళయాళంలోనే కాదు బాలీవుడ్, మిగతా వుడ్ లలో కూడా హీరోయిన్లపై లైంగిక దాడులు, కిడ్నాప్ లు రేప్ లు జరుగుతుంటాయని కానీ అందరూ భవిష్యత్ కోసం కిమ్మనకుండా ఉంటారని.. మళయాళ హీరోయిన్ మాత్రం బయటకొచ్చి విషయాన్ని మీడియాకు తెలిపిందని ఆమె అన్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని .. తనకూ అలాంటి వేధింపులు జరిగాయని.. కానీ వాటి నుంచి ధైర్యంగా తాను బయటపడ్డానని చెప్పుకొచ్చింది కంగనా..

To Top

Send this to a friend