ఆ తప్పు పవన్ ది కాదు.. నాదే..

BVSN Prasad Press Meet

అత్తారింటికి దారేది.. పవన్ , త్రివిక్రమ్ ల కలయికలో వచ్చిన భారీ హిట్ చిత్రం. ఈ చిత్రం విడుదలకు ముందు పైరసీ కి గురికావడంతో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిండా మునిగారు అనుకున్నారంతా.. కానీ పవన్ , త్రివిక్రమ్ అండగా ఉండి సినిమాను సర్య్కూలేట్ కాకుండా పోలీసులతో జాగ్రత్త వహించారు. ఆ తర్వాత సినిమా విడుదల కావడం .. ఘనవిజయం కావడం అలా జరిగిపోయింది..
అనంతరం ఇదే నిర్మాత ప్రసాద్ ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో సినిమా తీశారు. ఆ సినిమా విడుదలకు ముందు పవన్, త్రివిక్రమ్ తమకు రావాల్సిన డబ్బుల కోసం ఫిలించాంబర్ లో ఫిర్యాదు చేశారు.. ఇప్పుడు ముగిసిపోయిన ఆ వివాదం గురించి లేటెస్ట్ గా నిర్మాత ప్రసాద స్పందించారు. పవన్ కు డబ్బులివ్వని మాట వాస్తవేమనని.. కానీ ఆ సమయంలో తన దగ్గర డబ్బుల కొరత వల్ల ఇవ్వలేకపోయాన్నారు. ఆ తప్పు తనదేనని.. పవన్ ది కాదని.. డబ్బులిచ్చి ఆ వివాదాన్ని పరిష్కరించుకున్నాని నిర్మాత సెలవిచ్చారు..

To Top

Send this to a friend