ఆ ఒక్క విషయంలో జగన్ పెంచుకోవాల్సిందే..

2014 ఎన్నికల్లో జగన్ ఏపీలో గెలుస్తారనే నమ్మకం ఉండేది. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ప్రకటించడం.. జగన్ తెలంగాణ కాడి వదిలేసి ఏపీ కోసం నిలబడడంతో పాటు జగన్ పాదయాత్రలు, ఓదార్పుయాత్రలంటూ జనంలోకి వెళ్లారు. బీజేపీతో పొత్తుపెట్టుకొని వెళ్లిన చంద్రబాబును జనం కరుణించి గెలిపించారు. కాదుకాదు మీడియానే గెలిపించింది. కేంద్రంలో అధికారంలోకి ఖాయంగా వస్తుందని బీజేపీపై నమ్మకం ఏర్పడింది. అదేసమయంలో మోడీతో జట్టుకట్టిన చంద్రబాబును గెలిపిస్తే రాజధాని లేకుండా కట్టుబట్టలతో వెలివేయబడ్డ ఏపీకి న్యాయం జరుగుతుందని జనం భావించారు. అంతాకలిసి వైసీపీ జగన్ ను కాదని చంద్రబాబును గెలిపించారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి లాభం అన్న ప్రచారం చేయడంలో తెలుగు రాష్ట్రాల్లోని చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన రెండు ప్రధాన తెలుగు పత్రికలు.. 10 న్యూస్ చానాళ్లు తీవ్రంగా కృషి చేశాయి. ప్రజల్లోకి చంద్రబాబును తీసుకెళ్లాయి.. ఈ విషయంలో జగన్ సాక్షి, పత్రిక, మీడియా ఎంత ప్రయత్నించినా వాటన్నింటి ముందు తేలిపోయింది. అందుకే జగన్ ఇప్పుడు మీడియా సపోర్టును పెంచుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా కమ్మ సామాజికవర్గానికి కాపుకాస్తున్న తెలుగు మీడియాకు పోటీగా తనకు సపోర్టు చేసే మీడియాను పెంచుకోవాలని వ్యూహాలు పన్నుతున్నట్టు తెలిసింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి త్వరలోనే తెలుగులో ఓ న్యూస్ చానల్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇది పక్కా వైసీపీకి మద్దతుగా తేనున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగులో ఉన్న న్యూస్ చానళ్లలో మెజార్టీ చంద్రబాబుకు భజన చేసేవే ఉన్నాయి. జగన్ ఎక్కడ దొరికినా ఇవి ఏకీపారేస్తున్నాయి. అందుకే మీడియా బలం పెంచుకోవడంపై జగన్, ఆయన పార్టీ నేతలు దృష్టిసారించారు. ఈడీ జప్తుతో అగమ్యగోచరంగా తయారైన సాక్షి పత్రిక, చానల్ ఆస్తుల గొడవ తేలేలోపే మరికొన్ని మీడియా సంస్థలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల నాటికి బలాన్ని పెంచుకోవడం.. తమ వాణిని వినిపించడమే ధ్యేయంగా వైసీపీ ముందుకు వెళుతున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend