ఆ ఒక్క ఒప్పందం.. బాబు పదిలక్షల కోట్ల అబద్ధం?

నిజాలు ఎక్కడికిపోతాయి.. అబద్దాలు వెంటాడుతునే ఉంటాయి.. విశాఖపట్నం వేదిక అంతర్జాతీయ సదస్సు పేరిట చంద్రబాబు సర్కారు నిర్వహిస్తున్న పెట్టుబడుల మేళ అంతా అబద్ధమని ఆ ఒక్క ఒప్పందంతో రుజువైందని విమర్శకులు చెబుతున్నారు.. దేశ, విదేశీ కంపెనీలు బాబుకు సాగిలపడి చేస్తున్న ఈ పెట్టుబడుల దందా అంతా ఫేక్ అని నిరూపితమైంది..

పెట్టుబడులు అంటూ కొందరు పారిశ్రామిక వేత్తల పేర రావడం.. చంద్రబాబుతో ఫొటో దిగి ఓ ఎంవోయూ మీద సంతకాలు చేయడం.. పక్కన బాబు ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని తిని వెళ్లిపోవడం.. దానికి యెల్లో మీడియా అహో చంద్రబాబు పది లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఊదరగొట్టడం.. ఇదీ గత మూడు రోజులుగా జరిగిన తంతు..

బాబుతో ఒప్పందాలను చేసుకున్న ప్రముఖుల్లో చాలామంది ఫేక్ వాళ్లేనని తేలింది.. నర్సరావుపేటకు చెందిన ఓ ఫేమస్ పీఆర్వో దొడ్డల శ్రీధర్ కూడా చంద్రబాబుతో ఒప్పందం చేసుకొని ఎంవోయూ మీద సంతకం చేసి ఫొటో దిగాడు.. దీంతో బాబు బండారం బయటపడింది.. ఈ శ్రీధర్ ఎవరో కాదు.. కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తూ నాలుగు డబ్బులు కమీషన్లుగా తీసుకునే పీఆర్వోనట.. ఈ బోటాబోటీ పీఆర్వో ఏకంగా లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకునే చోటుకి వచ్చి అదీ సీఎం చంద్రబాబుతో ఎంవోయూ కుదుర్చుకోవడం ఫొటోలు దిగడం పత్రికల్లో వచ్చాక బాబు గారి లక్షల కోట్ల బండారం అంతా దూదిపింజ అని తేలిపోయింది.. ఈ శ్రీధర్ అడ్మిషన్ల పేరిట చేసిన దందాలు, గొడవలు.. నర్సారావు పేట జనానికి తెలుసు కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పేరు,, బాబుతో చేసుకున్న ఒప్పందం పై సెటైర్లు పడుతున్నాయి.. సో ఇలా చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలంటూ ఎడాపెడా ఎంవోయూ కుదుర్చుతూ విశాఖలోని విలువైన భూములను పప్పు బెళ్లాల్ల అమ్మేస్తున్నారన్నమాట..

To Top

Send this to a friend