ఆస్ట్రేలియాపై ఇండియా సూపర్ విక్టరీ


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా ఓటమి బాట నుంచి గెలుపుబావుట ఎగురవేసింది.. బౌలర్ల ప్రతిభ ముఖ్యంగా అశ్విన్ 6 వికెట్లతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. కోహ్లీ ప్రతి వికెట్ కు వికటాట్టహాసం చేస్తూ అభిమానులను చప్పట్లు కొట్టాలంటూ ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేశారు..

భారత్ విజయంలో మొదట బ్యాటింగ్ లో పూజారా(92) , రెహానా(52)ల జోడీ ఇండియా భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది.. వీరిద్దరి బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ముందు తొలి ఇన్నింగ్స్ లాస్ కలుపుకొని రెండు వందల లోపే ఆధిక్యం నిలిపింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కొట్టి వరుసగా రెండో టెస్ట్ ను కైవసం చేసుకుంటుందని ఆశించారు… కానీ అశ్విన్ 6 వికెట్లతో, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లతో విజృంభించడంతో ఇండియా ఆస్ట్రేలియాను 112 పరుగులకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించింది. మొత్తం 4 టెస్టుల సిరీస్ లో ఇండియా, ఆస్ట్రేలియాలు 1-1 ఆధిక్యంతో నిలిచాయి. మూడో టెస్ట్ రాంచీలో జరగనుంది.

To Top

Send this to a friend