ఆల్ టైం రికార్డ్: పవనా.. మజాకా.?


పవన్ కళ్యాణ్ మేనియా మరోసారి ఆవిష్కృతమైంది. పవన్ సినిమాను అభిమానులు ఏరేంజ్ లో ఆదరిస్తారోనన్న విషయం తేటతెల్లమైంది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది. దాదాపు నెలరోజుల క్రితం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు ఈ టీజర్ కు కోటికి పైగా వ్యూస్ వచ్చి ఆల్ టైం రికార్డ్ ను తిరగరాసింది. అదే సమయంలో రెండున్నర లక్షలకు పైగా లైక్స్ తో మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ సినిమాలో పవన్ సరనన శృతిహాసన్ హీరోయిన్. తమ్ముళ్లుగా వర్ధమాన హీరోలు చేస్తున్నారు..

తమిళ సూపర్ హిట్ మూవీ వీరమ్ కు రిమేక్ గా పవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోపాల గోపాల ఫేం డాలి కాటమరాయుడికి దర్శకుడు. మార్చి 24న సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. సమ్మర్ కానుకగా వచ్చే సినిమా రిలీజ్ కు ముందే కోటికి పైగా వ్యూస్ సాధించి ట్రైలర్ దుమ్మురేపడం పవన్ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది..

To Top

Send this to a friend