ఆరోగ్య రంగంలో విప్లవం

మోడీ హుద్రోగులకు తీపి కబురునందించారు.. గుండెనొప్పి వచ్చిన సమయంలో శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించే కరోనరీ స్టెంట్‌ ధరలను బాగా తగ్గించారు. స్టెంట్ల ధరలు ఏకంగా 85% తగ్గించారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి తక్కువ ధరలు అమల్లోకి వచ్చాయి. గుండె ఆపరేషన్ల పేరుతో లక్షల బిల్లు వేసి సామాన్యులను దోచుకుంటున్న కార్పోరేట్ ఆసుపత్రులకు దిమ్మ తిరిగేలా… గుండెకు అమర్చే స్టంట్ల ధరలను ఏకంగ 85% తగ్గించి ప్రపంచ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికిన మోడీ…

గుండెనొప్పి వచ్చిన సమయంలో శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించే కరోనరీ స్టెంట్‌ ధరలను భారీగా తగ్గించినట్లు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైజింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. గతంలో ఉన్న ధర కంటే దాదాపు 85 శాతం తగ్గించటంతో చాలా మంది రోగులకు ఇది ఉపయోగకరం కానుంది. గతేడాది దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని జాతీయ కనీస అవసర మందుల (ఎన్‌ఎల్‌ఈఎం) జాబితాలో పొందుపరిచింది. ఎన్‌ఎల్‌ఈఎం లిస్టులో ఉన్న మందులను ఎన్‌పీపీఏ చెప్పిన ధరలోనే వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్‌పీపీఏ స్టెంట్‌ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. మెటల్‌ స్టెంట్‌ (బీఎంఎస్‌) ధరను రూ.45వేల నుంచి రూ.7,260కు, ఔషధ ఆధారిత స్టెంట్‌ (డీఈఎస్‌) ధర రూ.1.21లక్షల నుంచి 29,600కు తగ్గించినట్లు ప్రకటించింది. వ్యాట్‌తో కలుపుకుంటే బీఎంఎస్‌ ధర గరిష్ఠంగా రూ.7,623, డీఈఎస్‌ ధర గరిష్ఠంగా రూ.31,080కు లభించనుంది. తగ్గించిన స్టెంట్ల ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనంతకుమార్‌ వెల్లడించారు. ధరల తగ్గింపుతో ఒక్కో రోగికి రూ.80వేల నుంచి రూ.90వేల వరకు ఆదా అవుతుందని ఆయన అన్నారు.

To Top

Send this to a friend