ఆ‘మంచి’ కాదు చెడే.. జర్నలిస్టు తల పగులగొట్టుడే.

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దాదాపు 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో ఎక్కడ ఏదీ దొరికితే అది నొక్కేస్తున్నారు. అవురావురంటూ అవినీతికి పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. కొందరు నిజాయితీ గల జర్నలిస్టులు వారిపై రాస్తే వారిని టార్గెట్ చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే మరికొందరు ఏకంగా వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
అధికార పక్షం అండదండలతో ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రెచ్చిపోతున్నారు. తన అవినీతిపై అక్కడి స్థానిక పత్రికల్లో వార్తలు రాసిన ఓ విలేకరి తల పగులగొట్టించేశాడు. పట్టపగలు అంతా చూస్తుండగానే పోలీస్ స్టేషన్ ఎదురుగానే కర్రలతో జర్నలిస్టు తలను అనుచరులతో పగులగొట్టేశాడు. తిరిగి అధికార దర్పంతో ఆ జర్నలిస్ట్ పైనే ఎదురు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం విమర్శలకు తావిచ్చింది..
చీరాలలో దోపిడీకి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోషన్ పాల్పడుతున్నాడని స్తానిక పత్రికల్లో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి రాశారు. ఇసుక, నీరు,విద్యుత్ ఇలా చీరాలలోని వనరుల్నింటిని ఎమ్మెల్యే అక్రమంగా కొల్లగొడుతున్నారని ఆ కథనం సారాంశం.. ఇది ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. దీంతో జర్నలిస్ట్ పై ఎస్సీ ఎస్టీ కేసుపెట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుటే కర్రలతో ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు.తల పగుల కొట్టారు. నాగార్జునరెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లైట్ తీసుకున్నారు. ఆమంచి అరాచకాలు ఇప్పటివీ కావు.. గతంలో కూడా వేరే పార్టీల్లో ఉన్నప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియాను బెదిరింపులకు గురిచేశాడు. ఇప్పుడు ఏకంగా దాడులకే దిగాడు. గుండాగిరీకి మారుపేరుగా నిలుస్తున్నాడని జర్నలిస్ట్ సంఘాలు అమంచిపై విమర్శలు గుప్పించాయి.

To Top

Send this to a friend