ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : పవన్

జనసేన అధినేత , స్టార్ హీరో పవన్ ఒక దశలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. చదవంటే తనకు ఇష్టం లేదని.. అలాగే పుస్తకాల్లోని చదువుకు.. బయట సమాజానికి చాలా తేడా ఉందని పవన్ స్పష్టం చేశారు. అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ తనకు ఎదురైన అనుభవాలు, అవమానాలను వారితో పంచుకున్నారు.

‘ఈ ప్రపంచంలో చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. చిన్నప్పటినుంచి గమనిస్తూనే ఉన్నా.. ‘మాబడి’ అనే పాఠ్యంశంలో పాఠశాల గురించి ఎందో సుందరంగా వివరించారు. ఒంగోలులతో తాను చిన్పపుడు చదివిన పాఠశాలలో ఆట స్థలం కూడా లేదు. ఇదే విషయాన్ని టీచర్ ను అడిగితే కొట్టారు. పుస్తకాల్లో చదివిన దానికి వాస్తవం వేరు అనేది గుర్తించాను.. ఇలాంటి పరిస్థితుల్లో చదువు మీద శ్రద్ధ కొరవడింది. ఫలితంగా ఫెయిల్ అవుతూ వచ్చా.. అస్థితిలో నైరాశ్యంలోకి వెళ్లా.. అన్నయ్య లైసెన్స్ రివార్వల్ తో కాల్చుకోవాలని అనుకున్నా’నని పవన్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

నిజామాబాద్ ఎంపీ కవితకు కృతజ్ఞతలు..
నిజామాబాద్ ఎంపీ కవితకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్..ప్రత్యేక హోదాపై ఏపీ అమరావతిలో పాల్గొన్న కవిత మద్దతు ప్రకటించడంతో ఆమెకు సంఘీభావంగా పవన్ ట్వీట్ చేశారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు తమ సంఘీభావాన్ని తెలియజేయాలి.‘ మన ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలి. సమైక్యంగా ఉంటే మనం నిలబడతాం.. విడిపోతే మనం పడిపోతాం..’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

To Top

Send this to a friend