ఆగస్ట్‌ 4న నారా చంద్రబాబు ‘చంద్రోదయం’

1
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు చేసిన సేవ మరియు ఆయన ప్రజలకు చేరువైన విధానాన్ని ముఖ్యాంశంగా తీసుకుని శ్రీ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో డివివి సాయికుమార్‌, వెంకటరమణ పసుపులేటిలు సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్‌ ఒరియంటెడ్‌ మూవీ ‘చంద్రోదయం’. ఈ మూవీ ఆగస్ట్‌ 4న ఒంగోలులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ చిత్ర బ్రోచర్‌ను హోం మినిస్టర్‌ నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకులు వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ..1996 నుండి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ప్రజలకు చేరువైన విధానం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవను విశదీకరిస్తూ ఈ ‘చంద్రోదయం’ను తెరకెక్కిస్తున్నాము. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులందరూ నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్‌ 4న ఒంగోలులో చిత్రాన్ని వైభవంగా ప్రారంభించనున్నాము. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ఉపముఖ్యమంత్రి, హోం మినిస్టర్‌ నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కాపు రాష్ట్ర అధ్యక్షులు చలనుశెట్టి రామాంజనేయులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొనున్నారు..అని అన్నారు.
కార్తీక్‌, పల్లవి శ్రేష్ట, అభిషేక్‌, శ్రీదేవి, రవివర్మ, పూజిత, సానిత, వర్ష, హరీష్‌, మలినేని లక్ష్మయ్య, హేమసుందర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్‌. ఎస్‌., సినిమాగోగ్రఫీ: సుధాకర్‌రెడ్డి. ఎస్‌., సహనిర్మాతలు: గిత్తలూరి వెంకటకృష్ణారావు, కాకు మల్లిఖార్జున యాదవ్‌, చింతమ సుబ్బారావు, నిర్మాతలు: వెంకటరమణ పసుపులేటి, డివివి సాయికుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటరమణ పసుపులేటి.
To Top

Send this to a friend