ఆగయా లోకేష్.. నెక్ట్స్ మంత్రియే..


ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ బాబు ఏపీ పరిపాలనలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటిలో లోకేష్ బాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని.. అంతకుముందు ఎమ్మెల్సీని చేయాలని నాయకులు కోరడం.. చంద్రబాబు ఓకే చెప్పడం జరిగిపోయింది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా సీట్లలో ఒకటి లోకేష్ కు కేటాయించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ప్రతిపాదనకు పార్టీ ఆమోదం తెలిపింది. ఈనెల 28న ఎమ్మెల్యేల కోటా నోటిఫికేషన్ జారీ చేయడంతో టీడీపీ నేత లోకేష్ నామినేషన్ వేయడం దాదాపు ఖరారైంది.
లోకేష్ ను క్రియాశీలకంగా మార్చి వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో కీరోల్ పోషించేలా చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకొని ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మెజార్టీ ప్రభుత్వం రాకపోతే కేంద్రంలో కీరోల్ పోషించేలా చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలని.. అదే సమయంలో రాష్ట్రంలో కొడుకుకు పగ్గాలు అప్పగించాలనే ప్లాన్ వెనుక ఉన్నట్టు సమాచారం. అందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు ఈ రెండేళ్లు మంత్రిని చేసి లోకేష్ పరిపాలన దక్షతను పరీక్షించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend