ఆంధ్ర ట్రంప్ ను చూసి మైక్రోసాఫ్ట్ సీఈవో భయపడ్డాడు..


‘మన జగనాలు ఏదో అనుకున్నాం కానీ అసెంబ్లీలో ఇరగదీశాడ్ర బాబూ..’ నిన్న అసెంబ్లీ ప్రసంగం విన్నాక ఓ సామాన్యుడి నుంచి వచ్చిన మాట ఇదీ.. నిజమే.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాటు దేలారు. మాటల తూటాలు పేల్చాడు. ఆయన పత్రికల్లో పనిచేసే సీనియర్ల స్ర్కిప్ట్ లేకో ఆయన సొంత తెలివి తేటలో తెలియదు కానీ జగన్ ప్రసంగంలో వాడి ఎక్కువైంది. జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోలేక అధికార టీడీపీ మంత్రులు ప్రతిసారీ అడ్డుపడి ఆయన్ను మాట్లాడనీయకుండా చేశారు. చివరకు స్పీకర్ జగన్ కుమ్ముడు చూసి ఏకంగా సభను సోమవారానికి వాయిదా వేశాడంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు..

జగన్ తన ప్రసంగంలో ఏపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబును, అవినీతి పాలనను తీవ్రంగా ఎండగట్టారు.. భారత ప్రభుత్వ ఎన్సీఏఈఆర్ రిపోర్టులో ఏపీ అవినీతిలో నంబర్ 1 ర్యాంకు పొందిందని. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వణికిపోతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ పేరు చెబితే భారతీయులు భయపడినట్లు ఇప్పుడు అవినీతి చంద్రబాబును చూసి సంస్థలు పెట్టుబడులు పెట్టకుండానే పలయానం చిత్తగిస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ఇందుకో ఉదాహరణను చూపించారు.

జగన్ మైక్రోసాఫ్ట్ సీఈవో-చంద్రబాబు దోస్తీపై పదునైన విమర్శలు చేశారు.. ‘సత్యనాదెళ్లకు తానే స్ఫూర్తి అని చంద్రబాబు అంటారు. తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటారు. అమరావతి 11 వ మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సత్యనాదెళ్ల అంగీకరించారని చంద్రబాబు అక్టోబర్ 21న ప్రకటించారు. కానీ చంద్రబాబు చెప్పిన కొన్ని గంటల్లోనే సత్య నాదెళ్ల తాము ఏపీ కంపెనీ పెట్టడం లేదని ప్రకటించారు. ఇక్కడి అవినీతిని.. బాబు అజమాయిషీని చూసి మైక్రోసాఫ్ట్ సంస్థే వెనక్కి తగ్గిందంటే ఏపీలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని జగన్ సెటైర్ వేశారు..

ఇక ఏపీ సీఎం చూపిస్తున్న 10.99శాతం వృద్ధిని చూపించి సెటైర్లు వేశారు. రొయ్యల ఉత్పత్తి పెరుగుదలను చూపించి బాబు అభివృద్ధి జరిగిందంటున్నారు. లెక్కల మాయ చెప్పి అభివృద్ధి అని చూపిస్తే కేంద్రం నిధులే ఇవ్వదని.. ఈ విషయం తెలియని బాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని జగన్ విమర్శించారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు ఆ లెక్కలు అర్థం కాకపోవచ్చు.. అని టీడీపీ నేతల లెక్కల మాయను ఎండగట్టారు.

మొత్తానికి తొలిరోజు జగన్ ప్రసంగం అదిరిపోయింది. ఆయన ప్రతి మాట తూటాల పేలింది. ప్రతిసందర్భాన్ని వాడుకొని చంద్రబాబు సర్కారును ఇరుకునపెట్టాడు.

To Top

Send this to a friend