ఆంధ్రులు.. మీలా బానిసలు కాదు.. అయ్యన్న జీ..

మాటకు మాట.. కాదు తూటాలే సంధిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ట్వీట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. హోదాకు మద్దతుగా ఏపీ యువత చేస్తున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట ఇచ్చి నెరవేర్చని బీజేపీని, టీడీపీని కడిగిపారేస్తున్నాడు. హోదా కోసం ఆంధ్ర ప్రజలు, యువత పోరాడాలని పిలుపునిస్తున్నాడు.

పవన్ వ్యాఖ్యలను నిన్న తప్పుపట్టిన ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడుని తప్పుపట్టారు. ‘పవన్ ఎన్నికల సందర్భంగా మోడీ పక్కనే కూర్చున్నారు.. ఆయనే ప్రధానితో మాట్లాడొచ్చు కదా’ అని విమర్శించారు… దీనికి కౌంటర్ గా పవన్ అయ్యన్న పాత్రుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు..

పవన్ ఈరోజు ట్వీట్ తో అయ్యన్నను కడిగిపారేశాడు.. ‘‘పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు నన్ను మోడీ గారితో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. నేను మోడీ పక్కన కూర్చున్నాను. కానీ మీ ఎంపీలు అందరూ ఆయనతోనే పార్లమెంటులో కూర్చుంటారు కదా.. మరి మీరేం చేస్తున్నారు..? కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వదని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏంటి.? మీరు ఆ పనిచేయకపోబట్టే కదా ఈరోజు యువత రోడ్ల మీదకు వస్తోంది. యువతను ఏమీ చేయనియ్యకుండా .. మీరు చేయకుండా ఉంటే దీని పరిష్కారం ఏంటీ అని’’ ట్విట్టర్ లో దుమెత్తిపోశారు.

పవన్ సంధించిన ట్వీట్లను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend