ఆంధ్రావాళ్లు ఇలా చేస్తారనుకోలేదు..


కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆశ్చర్యపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుపతి విమానాశ్రయంలో , తిరుమల కొండపై ఘనస్వాగతం లభించడం తనను ఆశ్చర్యానికి గురిచేసందని వీహెచ్ వ్యాఖ్యానించారు. తాను గతంలో తిరుపతిలో పర్యటించినప్పుడు తెలంగాణ ఎంపీనని నిరసనలు తెలిపారని.. కానీ ఆంధ్రావాలా బాగో.. అన్న కేసీఆర్ కు ఆశ్చర్యకరంగా ఇంతటి ఘనస్వాగతం పలుకుతారా అని వీహెచ్ సంశయపడ్డారు.
హైదరాబాద్ లో ివిలేకరులతో మాట్లాడిన వీహెచ్ కేసీఆర్ తీరుపై విమర్శలు చేశారు. ‘ఇదేం రాజకీయం.. ఆంధ్ర ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారనుకున్నా.. అన్ని తిట్లు తిట్టిన కేసీఆర్ ను ఇలా దగ్గరుండి స్వాగత సత్కారాలు చేస్తారు.. అసలు మీ రాష్ట్రం ఇట్ల కష్టాలు పడ్డానికి కేసీఆరే కారణం.. అట్లాంటి ఆయనకు ఇంత స్వాగతమా.. కేసీఆర్ ను చూసి ఆంధ్రోళ్లు వణికిపోతున్నారా..? అని వీహెచ్ ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య అవగాహన ఉందనడానికి ఈ అతిథి మర్యాదలు చక్కటి ఉదాహరణ అని వీహెచ్ అన్నారు. ఉద్యమంలో పిల్లలను రెచ్చగొట్టి.. ఆత్మహత్యలకు పురిగొల్పి.. ఇద్దరు చంద్రులు రాజకీయంగా లబ్ధి పొందారని.. దీనిబట్టి తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న వారి మొక్కులకు ప్రభుత్వం సొమ్మును వాడుకుంటారా అని వీహెచ్ కేసీఆర్ ను తీరు ను తప్పుపట్టారు.

To Top

Send this to a friend