ఆండ్రాయిడ్ రూపకర్త మార్కెట్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు..

అది 2005 ఇప్పుడు అందరి ఫోన్లలో వాడుతున్న ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కే అమ్మేసి అందరి నోళ్లలో నానాడు ఆండ్రాయిడ్ రూపకర్త ఆండీ రూబిన్.. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు అన్ని ఫోన్లలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లే ఉన్నాయి. అంతటి ప్రతిష్టాత్మకంగా సాఫ్ట్ వేర్ ను రూపొందించిన రూబిన్ తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు గూగుల్ లోనే పనిచేశాడు. అనంతరం 2014లో ‘ప్లే గ్రౌండ్’ పేరిట సంస్థను స్థాపించి గూగుల్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత 2015 లో ఎసెన్షియల్ ప్రాడక్ట్స్, ఇంక్ అనే టెక్నాలజీ సంస్థను స్థాపించాడు. అందులోకి గూగుల్, యాపిల్ నుంచి నిపుణులను తీసుకొచ్చాడు.. అక్కడే పని ప్రారంభించాడు..

ఇప్పుడు రూబిన్ ఆధ్వర్యంలో అందరూ కలిసి ప్రపంచంలోనే నాజూకైన హై ఎండ్ ఫోన్ ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడట.. అండ్రాయిడ్ ఎలా హిట్ అయ్యిందో అలా సరికొత్త ఫీచర్లు, 3డీ టెక్నాలజీతో ఫోన్ తయారు చేసే పనిలో ఉన్నాడట రూబిన్.. దాంతో పాటు స్మార్ట్ ఫోన్లు, గ్రుహ ఉపయొగ యాప్ లు, స్మార్ట్ వస్తువులు, వాచీలు ఇలా అన్నింటిని తయారు చేసి గూగుల్, యాపిల్ సంస్థలకు పోటీగా నిలవాలని రూబిన్ ప్రయత్నాలు చేస్తున్నాడట.. వచ్చే జూన్ లో విడుదలయ్యే రూబిన్ సరికొత్త ఫోన్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.. సో మరి సరికొత్త టెక్నాలజీ ఆవిష్కారినికి అందరూ సిద్ధం కండి..

To Top

Send this to a friend