అసెంబ్లీ బాబు సొంతిల్లు మరీ!

చంద్రబాబు గీసిందే గీత.. చెప్పిందే శాసనం.. ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి కర్త కర్మ, క్రియా అంతా ఆ చక్రవర్తి నారా చంద్రబాబు నాయుడు మహారాజు గారే… ఎందుకంటే.. ప్రజాకార్యక్రమాలైనా.. అభివృద్ధి పనులైనా ఆయనకు నచ్చితే లేపుతారు.. లేదంటే తొక్కేస్తారు.. డబ్బా కొట్టుకోవాలన్నా.. అతిథుల్ని పిలవాలన్నా అధికారులు ఆయన అడుగులకు మడుగులు ఒత్తాల్సిందే..

అప్పట్లో అమరవాతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన చంద్రబాబు గొప్పగా చేశారు. కోట్లు ఖర్చు చేసి మోడీని, కేసీఆర్ ను పిలిచారు. మోడీ మట్టి నీళ్లు ఇచ్చి కట్టుకోమన్నాడు. రూపాయి విదిల్చలేదు. చంద్రబాబు హంగు ఆర్భాటంపై అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇక ప్రతిపక్ష నేత ఈ సభను బాయికాట్ చేశాడు..

ఇక ఇప్పుడు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి హైటెక్ హంగులతో కట్టించిన అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం విస్మయానికి గురిచేసింది. అది చంద్రబాబు ఇళ్లు కాదు కదా.. రేపు సమావేశాల్లో ఆయన ఒక్కరే అందులో కూర్చోరు కదా.. ప్రతిపక్షం తప్పనిసరి.. అలాంటి వారిని తన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినట్టు పిలవకుండా చంద్రబాబు అసెంబ్లీని ప్రారంభించేయడం విమర్శలకు తావిచ్చింది. జగన్ ను పిలవడం ఇష్టం లేదేమో.. అందుకే అధికారులతో చివరి నిమిషంలో ఫోన్ చేయించాడట..

చంద్రబాబు ఎంతో వ్యయప్రయాసాల కోర్చి కట్టించిన అసెంబ్లీ విషయంలో ఏకపక్షంగా పోయి టీడీపీ మంత్రులు, స్పీకర్ తో ఓపెనింగ్ ను కానిచ్చేశారు. వివాదాలకు పోవద్దనో.. లేక విమర్శలు వస్తాయనో తెలియదు కానీ.. ఇలా ఎవరినీ పిలవకుండా తన సొంత ఆస్తిలా ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు తీరుపై ప్రతిపక్షాలు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

To Top

Send this to a friend