అసెంబ్లీ ప్రస్తుతానికి టీఆర్ఎస్ దే పో!

ఆవేశం లేదు.. ఆగ్రహం లేదు.. అంతా సైలెన్స్.. ప్రతిపక్షం పటాసులా పేలడం లేదు. అంతా నిర్వేదం.. అధికార పార్టీ తాము చేసిన పనులను ఠంకా బజాయించి చెబుతున్నా ప్రతిపక్షం చప్పుడే చేయదు.. తెలంగాణ ఓచ్చిన కొత్తలో తెలంగాణా అసెంబ్లీ సమావేశాలంటే ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేవారు.. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది..

తొలి రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షమయిన కాంగ్రెస్ ని టీఆర్ఎస్ బాగానే కంట్రోల్ చేయగలిగింది. కానీ టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా తయారైన తెలుగు దేశం పార్టీ ని మాత్రం అదుపు చేయలేకపోయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఒంటి కాలు మీద లేస్తున్నాడు. ప్రభుత్వం మీదికి చర్చల్లో రేవంత్ రెడ్డి పూర్తిగా ఇరుకున పెడుతున్నాడు.. ప్రజలకు వాస్తవాలను తెలిపే ప్రయత్నం చేసాడు కాబట్టే 2017 బడ్జెట్ సమావేశాలకు రేవంత్ రెడ్డి ని పక్కా ప్లాన్ తో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సస్పెండ్ చేసింది.

రేవంత్ రెడ్డి , సండ్ర వెంకట వీరయ్య సస్పెన్స్ నిజంగా అప్రజాస్వామికం అని తెలిసినా కూడా కనీసం మీడియా కూడా తన పాత్రను ఈ విషయంలో సమర్థంగా పోషించలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది మీడియా కి ఏ మాత్రం మంచిది కాదు.. తెరాస ప్రభుత్వమే ఎల్లకాలం పరిపాలించలేదనే వాస్తవాన్ని టీఆర్ఎస్ గుర్తించాలి. తెలంగాణలో తరువాత ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పరిస్థితి పటిష్టంగా ఉంది.టీఆర్ఎస్ ను కాదని ఇప్పుడున్న పరిస్థితి కి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మీడియా బ్రతుకు ఆగమ్యగోచరమే అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend