అసలు ముందు కొసరు ‘బాహుబలి’

బాహుబలి ట్రైలర్ ఈనెల 16న విడుదల కానుంది. ఈ ట్రైలర్ కోసం జనం, అభిమానులు , మీడియాలో ఎంతో ఆసక్తి ఉంది. దేశం, ప్రపంచమంతా క్యూరియాసిటీ నెలకొంది. ఈ బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. మొదటి భాగం విజయవంతం కావడంతో రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలు అత్యంత అద్భుతంగా ఉంటాయని ఇప్పటికే రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పడంతో ఎప్పుడెప్పుడు ట్రైలర్ విడుదలవుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

బాహుబలి2 ట్రైలర్ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ లో రాజమౌళి,-బాహుబలి టీం పోస్టర్ ను ట్రైలర్ లోని కొసరును విడుదల చేసింది. ఇందులో రక్తమోడుతున్న ప్రభాస్ కనిపిస్తాడు. పక్కన శివుడి కన్నుపై కూడా రక్తం కారడం మనకు కనిపిస్తుంది. యుద్ధం, పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫైట్స్ ప్రధాన ఆకర్షణ. అందుకే ఇప్పుడు ఆ పోరాట సన్నివేశంలోని ఓ బిట్ ను రిలీజ్ చేసి రాజమౌళి ఆసక్తి రేపారు.

రాజమౌళి విడుదల చేసిన బాహుబలి2 ట్రైలర్ లోని కొసరును కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend