అవును.. మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి పందుల ఆటలు ఆడాల్సిందే..

ఇప్పుడిప్పుడే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎవరు నాయకులు.. ఎవరు దోపిడీ దారులు.. ఎవరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలరు… ఎవరు ప్రజల తరఫున పోరాడగలరు.. ఏపీ ప్రజల కళ్లు తెరుచుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో ఓటేసిన పాపానికి పందులతొ ఆడుకోవాల్సిన దుస్థితి ప్రజలకు వచ్చిందా..? స్వయంగా ఏపీ ప్రజల తరపున ఎన్నుకున్న కేంద్ర మంత్రి, ఎంపీ సుజనాచౌదరి.. అదే అన్నారు.. జల్లికట్టులా.. హోదా కోసం కొట్లాడుతారా..? పందులతో ఆటలు ఆడుకోండి అంటూ మండిపడ్డారు.. అలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు ప్రజలు పందులతొ ఆటలు ఆడుకోవాల్సిందే మరి..అవును ఎలాంటి పందులతొ అడుకోవాలొ ప్రజలు కూడా నిర్నయిస్తారు త్వరలోనె అని కొంతమంది యువత హెచ్చరిస్తున్నారు.

రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి. ప్రజలనే తిట్టే నాయకులు వచ్చారు. ఏపీ ప్రజల గుండె చప్పుడు లాంటి హోదా కోసం పోరాడుతున్న యువకుల మీద కేంద్ర మంత్రి సుజన చౌదరి పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జల్లికట్టు కోసం పోరాడుతుంటే ఇక్కడ దాన్ని స్ఫూర్తిగా పందుల ఆటలు ఆడుకోవాలని.. కానీ ఇలా హోదా కోసం రోడ్డెక్కడమేంటని ఆయన ఫీలింగ్.. అంతే మరి.. అధికార మదంతో గద్దెనెక్కి డబ్బులు వెదజల్లి సీట్లు కొనుక్కొని ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఇలాంటి నేతలకు ఏపీ ప్రజల ఆకాంక్ష.. పందుల ఆటలతోనే సమానం.. ఇది మనం చేసుకున్న దౌర్భాగ్యం..

To Top

Send this to a friend