అవునా.. ఇది నిజమా ముద్రగడ..?


రాజకీయం.. రాత్రిళ్లే జరుగుతుందంటా..? అంతా సీక్రెట్ గా వ్యూహాలు, ప్రతివ్యూహాలు రాత్రిళ్లే కానిచ్చేస్తారట.. ఏమో అది నిజమో కాదో మనకేలా తెలుస్తుంది..రాజకీయాల్లో తలపండిన నాయకులు అప్పుడప్పుడూ ఇలా నోరెత్తితే నిజాలు బయటపడతాయి.. అదే జరిగింది.. ఒక రాజకీయ సంచలన వ్యాఖ్య బయటపడింది..
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ఇటీవల ఓ సంచలన విషయం బయటపెట్టాడు.. విలేకరులు ‘మీ ఉద్యమానికి వెన్నుదన్నుగా జగన్ ఉన్నాడట’ అన్న ప్రశ్నకు ముద్రగడ ఫైర్ అయ్యాడు. జగన్ కుర్రాడు.. నా రాజకీయ జీవితంలో సగం ఉంటాడు.. ఆయన నాకు ఎందుకు సపోర్టు చేస్తాడు.. చేసినా నే తీసుకుంటానా..? నాది మా జాతి విముక్తి పోరాటం.. నేనే సొంతంగా చేస్తున్న నా ఉద్యమంలో జగన్ కు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. ఇదంతా బాబు కాపు ఉద్యమాన్ని అణచడానికి చేస్తున్న విష ప్రచారమని మండిపడ్డారు. దీంతో పాటు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అంతా చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియానే కావడంతో ఆ విషయం ఎక్కడా సంచలనంగా మారలేదు.. కానీ సోషల్ మీడియా దీన్ని అందిపుచ్చుకొని వాస్తవాలను బయటకు తెస్తోంది..
ముద్రగడ సంచలన వ్యాఖ్య ఏంటంటే.. ‘అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగిందట.. బాలక్రిష్ణ తన ఇంట్లో తుపాకీతో ఓ నిర్మాతను కాల్చిపారేశాడు.. ఇంత జరిగినా బాలయ్య మీద కేసు కానీ, అరెస్ట్ కానీ జరగలేదు.. ఎందుకు తెరవెనుక ఏం జరిగింది అనే దానిపై ముద్రగడ క్లారిటీ ఇచ్చాడు..
బాలక్రిష్ణ కాల్పుల కేసు నుంచి రక్షించమని స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అర్ధరాత్రి ప్రైవేటు కారులో వెళ్లి వైఎస్ ను బతిమిలాడాడని.. ఇది కొందరికే తెలుసునని.. అలా నేను ఎప్పుడు ఎవరి సాయం కోసం అర్రులు చాచే మనస్తత్వం కాదని ముద్రగడ వ్యాఖ్యానించారు. బాబులా అర్ధరాత్రి వెళ్లి కాల్లు పట్టుకొని సాయం కోరే వ్యక్తిత్వం తనది కాదని కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు తెలుగునాట ఎక్కడ ఏ చానాళ్లలో రాకపోయినా.. ముద్రగడ అన్నది మాత్రం ఇదే.. బాబు అనుకూల మీడియా దీన్ని తొక్కేసినా సోషల్ మీడియా ద్వారా ఇలా బయటకు వచ్చింది..

To Top

Send this to a friend