అల్లు అర‌వింద్ గారి చేతుల మీదుగా “వెంకటాపురం”

గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఈ చిత్రంలో హ్యాపీడేస్ లో టైసన్ క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు. రాహుల్ డిఫరెంట్ లుక్ తో, ఆటిట్యూడ్ తో కనిపించబోతున్నారు. బాలీవుడ్ టీవీ ఆర్టిస్ట్ మహిమా మక్వాన్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు సంగీత దర్శకత్వం వహించాడు. సాయి ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. కాశీ విశ్వనాథ్, అజయ్, జోగి బ్రదర్స్, అనితా, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ అండ్ సెకండ్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పోస్టర్స్‌ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఊపుతో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గారి చేతుల మీదుగా ఈచిత్రం యెక్క ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి స్వామి రారా, రౌడీ ఫెలో చిత్రాలకు వేణు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ తో పాటు జెమిని కిర‌ణ్ గారు, అవ‌స‌రాల శ్రీను, డార్లింగ్ స్వామి హ‌జ‌య‌రయ్యారు.

ముఖ్య అతిధి అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత‌లు శ్రేయాస్ శీను, ఫ‌ణి గారు బాగా తెలుసు. సినిమా అంటే ఫ్యాష‌న్ తో ఇండ‌స్ట్రిలో అంద‌రి నోట్లో నాలుక‌లా వుంటూ చిన్న చిత్రాలు తీయ‌ట‌మే కాకుండా స‌క్స‌స్ లు సాధిస్తున్నాడు. చిన్న చిత్రాలు రావాలి, అప్పుడే ఇండ‌స్ట్రిలో ప‌దిమంది బ్ర‌తుకుతారు. మంచి కాన్సెప్ట్ తో చిత్రాలు చేస్తున్నారు. హీరో రాహుల్ కి మ‌రోక్క‌సారి బ్రేక్ రావాలి, నిర్మాత‌ల‌కి డ‌బ్బులు, ద‌ర్శ‌కుడికి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను.

జెమెని కిరణ్ గారు మాట్లాడుతూ.. రాహుల్ కి మంచి హిట్ రావాలి, ద‌ర్శ‌కుడు కి పేరు రావ‌లి, నిర్మాత కి లాభాలు రావాలి అని కోరుకుంటున్నాను. ట్రైల‌ర్ చాలా బావుంది. అని అన్నారు
అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు వేణు చాలా క‌ష్ట‌ప‌డి ఈ చిత్రాన్ని చేశాడు. మంచి టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు . హీరో రాహుల్, నిర్మాత‌ల‌కి చాలా మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను.

హీరో రాహుల్ మాట్లాడుతూ.. మా చిన్న చిత్రాన్ని ఎమెష‌న‌ల్ గా క‌మిట్ మెంట్ గా చేశాము. ప్ర‌తి ఓక్క‌రు ఈ చిత్రాన్ని ప్రేమించి చేశారు. ఈ ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఓక్క‌రూ ఆ మాట చెప్తారు. ఇంట్ర‌స్టింగ్ గా ఈ చిత్రం వుంటుంది. మా ఆహ్వానాన్ని మ‌న్నించి వ‌చ్చిన అర‌వింద్ గారికి, కిర‌ణ్ గారికి, అవ‌స‌రాల శ్రీను గారికి, డార్లింగ్ స్వామి గారికి మా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… వెంకటా పురం ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు సైతం ప్రశంసించడం విశేషం. ఇప్పుడు రిలీజ్ చేసిన ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటుంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. దర్శకుడు వేణు డిఫరెంట్ కథను, తనదైన స్క్రీన్ ప్లేతో ఎంటర్ టైనింగ్ గా చెప్పబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేస్తాము. మంచి చిత్రం తీసాము. ఇంత మంచి చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ని మంచి మ‌నసున్న అల్లు అర‌వింద్ గారు చేతుల మీదుగా విడుద‌ల చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ట్రైల‌ర్ చూసి వ‌చ్చి విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో అరవింద్ గారు చిత్రాన్ని చూస్తారు. ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాం..అన్నారు

నటీనటులు – రాహుల్, మహిమా మఖ్వానా, అజయ్, జోగి బ్రదర్స్, కాశి విశ్వనాథ్, శశాంక్

సాంకేతిక నిపుణులు
ఆర్ట్ – జె. మోహన్
కెమెరామెన్ – సాయి ప్రకాష్
మ్యూజిక్ – అచ్చు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – వేణు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – తాళ్లూరి ఆనంద్
ప్రొడ్యూసర్ – ఎంవివి సత్యనారాయణ
లైన్ ప్రొడ్యూసర్ – కె.అరున్ మోహన్
ప్రొడక్షన్ కంట్రోలర్ – వాసిరెడ్డి సాయిబాబు
డ్యాన్స్ మాస్టర్స్ – అనీష్ విగ్నేష్, అనితా నాథ్
పి.ఆర్.ఓ – ఎస్.కె.ఎన్. ఏలూరు శ్రీను
లిరిసిస్ట్ – అనంత శ్రీరాం, వనమాలి, అజయ్ కుమార్
ఎడిటింగ్ – మధు
స్టోరీ, డైరెక్షన్ – వేణు మడికంటి

To Top

Send this to a friend