అల్లు అర్జున్ మూవీకి తప్పని లీక్ బెడద


ఈ మధ్య లీకువీరులు ఎక్కువై పోతున్నారు. టాలీవుడ్ లో అదీ మరీ ఎక్కువైంది.. ఆ మధ్య అత్తారింటికి దారేది విడుదల కాకముందే సగం సినిమా యూట్యూబ్ లోకి ఎక్కి టాలీవుడ్ నే షాక్ కి గురిచేసింది. ఇప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా సినిమాను తీసిన దిల్ రాజు-అల్లు అర్జున్ ద్వయానికి లీకేజీ బాధ తప్పలేదు. తాజాగా దువ్వాడ జగన్నాథమ్ పేరుతో అల్లు అర్జున్ తీస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ 18న విడుదల కాబోతోంది. అంతకంటే ముందే బన్నీ షూటింగ్ లోని లుక్ ను ఎవరో సోషల్ మీడియాలో పొటో పెట్టి రిలీజ్ చేశారు. దీంతో దిల్ రాజు టీం ఖంగుతింది. ఈ ఫొటో చూశాక అల్లు అర్జున్ సినిమాలో బ్రాహ్మణుడిగా నటిస్తున్నట్లు కన్ ఫం అయ్యింది. ఎవరో ఆకతాయి ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బన్నీ-దిల్ రాజు కష్టం ఇలా వృథా అయ్యింది..
దిల్ రాజు నిర్మాతగా.. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ముందే సోషల్ మీడియాలో బన్నీ ఫొటో రిలీజ్ కావడం గమనార్హం. దీన్ని బట్టి బన్నీ పాత్ర, చిత్రణ, స్టోరీ రిలీజ్ అయిపోయినట్టే.. మరిన్ని లీకులు రాకముందే దిల్ రాజు శ్రద్ధ తీసుకుంటే మంచిది..

To Top

Send this to a friend