అల్లు అర్జున్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడు!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే మరో సినిమా ఒప్పేసుకున్నాడు. దువ్వాడ జగన్నాథం.. ఈ సమ్మర్ లో విడుదల కానుంది. ఆ సినిమా విడుదలకు ముందే బన్నీ కొత్త సినిమా పట్టాలెక్కనుంది..

ప్రముఖ రచయిత రేసుగుర్రం, కిక్, టెంపర్ సహా చాలా సినిమాలకు కథలను అందించి హిట్ రచయిత గా పేరుతెచ్చుకున్న వక్కంతం వంశీతో బన్నీ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. వక్కంతం వంశీ చెప్పిన కథ బన్నీకి నచ్చడంతో ఆయన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. ఇప్పటిక వంశీ తన తొలి సినిమాను ఎన్టీఆర్ తో చేస్తున్నాడు.. ఆ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేయనున్నాడు. అద్బుతమైన కథలతో ఇండస్ట్రీని షేక్ చేసిన వక్కాంతం మరీ బన్నీతో ఎలాంటి కథను ఎంచుకుంటాడో ఆసక్తికరంగా మారింది..

To Top

Send this to a friend