అల్లు అర్జున్ అంటే అందుకే అంతపిచ్చి..

ఎవ్వరైనా ఊహిస్తారా అసలు.. దువ్వాడ జగన్నాథమ్ అనే టైటిల్ ను సినిమాకు పెట్టి.. ఫస్ట్ లుక్ గా ఓ రుద్రాక్ష.. ఓ శివుడి లింగం.. ఓం ఆకారం.. విడుదల చేస్తారా..? అస్సలు వీటికి ఏమైనా సంబంధం ఉందా..? అదే మరి క్యూరియాసిటీ అంటే.. బన్నీ పేరులోనే ఉంది మరీ..

అల్లు అర్జున్ ఏదీ చేసినా సంచలనమే.. ఆదినుంచి బన్నీ వేసిన ప్రతి అడుగు విజయంవైపే.. కథల ఎంపికలోనూ.. ప్రతి సినిమాలోనూ తన గెటప్ ను చేంజ్ చేస్తూ అల్లు అర్జున్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాడు. రోటీన్ మూసధోరణిలకు దూరంగా విభిన్నమైన కథలను, దూకుడైన పాత్రలను ఎంపిక చేసుకొని ఇంట్లో ఒకడిలా కలిసిపోతాడు.. తెరపై అల్లు అర్జున్ అనే హీరో కనపడడు.. మన పక్కింటి అబ్బాయే తెరపై ఉన్నాడేమో అనేలా తన ఆహార్యాన్ని ,నటనను, డాన్యులను చూపిస్తాడు. అందుకే బన్నీ సినిమా వస్తుందంటే మన తెలుగులోనే కాదు.. మలయాళం కూడా ఆసక్తి చూపుతారు. బన్నీ సినిమాలకు మలయాళంలో పిచ్ఛ ఫాలోయింగ్ ఉంది..
ఆర్య సినిమా నుంచి మొదలైన బన్నీ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది.. మధ్యలో కంచెలాంటి సందేశాత్మక చిత్రం చేసినా.. రుద్రమదేవి లాంటి చారిత్రక కథలో ఒదిగిపోయిన బన్నీని ని మించిన నటుడు లేడు. రేసుగుర్రంతో రికార్డులు బద్దలుకొట్టి.. ‘సరైనోడు’గా ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రతి సినిమాలో ఢిపెరెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు..
అందుకే బన్నీ కొత్త చిత్రం వస్తుందంటే.. అంతెందుకు బన్నీ కొత్త చిత్రం చేస్తున్నాడంటే అది మినిమం గ్యారెంటీ సినిమా.. అస్సలు బన్నీ కెరీర్లోనే ప్లాపులు లేవు. అందుకే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అల్లు అర్జున్ సినిమా అంటే ఖచ్చితంగా కొంటారు.
ఇప్పడు దిల్ రాజు నిర్మాణంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీసినిమా చేస్తున్నాడు. దాదాపు పూర్తికావచ్చిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం పేరు దువ్వాడ జగన్నాథమ్.. సినిమా పేరు వింటే ఏదో మాస్ మసాలా అనిపిస్తుందా.. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ లు చూశాక.. అసలు సినిమాకు, ఈ పోస్టర్ లకు ఏం సంబంధం అని అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. అల్లు అర్జున్ రెండు రోజులుగా దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ గురించి రోజుకో ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా అందులో ఆధ్యాత్మిక భావాలు గల ఫొటోలే దర్శనమిచ్చాయి. మొదటిరోజు రుద్రాక్ష మాల, శివుడి ఆన.. రెండోరోజు ఓం ఆకారం.. విడుదల చేసి దిల్ రాజు-బన్నీ టీం మొత్తం టాలీవుడ్ నే ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా పేరుకు..ఈ పోస్టర్ కు అస్సలు సంబంధం లేని విధంగా ఉంది. దీంతో కథపై ఆసక్తి నెలకొంది. బన్నీ మరో అద్భుతం చేస్తున్నాడని ఈ సినిమాపై బోలేడు అంచనాలు పెరిగిపోయాయి.

To Top

Send this to a friend