అల్లరి నరేష్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేంటి భయం’

అల్లరి నరేష్‌, జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేంటి భయం’
అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేంటి భయం’. జూన్‌ 30 హీరో అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త చిత్రం విశేషాలను తెలియజేశారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌.
నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”జూన్‌ 23 నుండి కంటిన్యూగా షూటింగ్‌ జరుగుతోంది. నాగేశ్వరరెడ్డి ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’ కథ చెప్పగానే డెఫినెట్‌గా చాలా మంచి ఎంటర్‌టైనర్‌ అవుతుందనిపించి ఇమ్మీడియట్‌గా స్టార్ట్‌ చేశాం. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్‌” అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. నరేష్‌తో సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ వంటి హిట్‌ చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమా మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది” అన్నారు.
అల్లరి నరేష్‌, కృతిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌లతోపాటు మరో 20 మంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
To Top

Send this to a friend