`అమ‌రావ‌తి అమ్మాయి`


అచ్చ‌మైన తెలుగింటి ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్క‌నున్న చిత్రం `అమ‌రావ‌తి అమ్మాయి`. సుజాత ఆర్ట్స్ సంస్థ బ్యాన‌ర్‌పై అరుంధ‌తి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బెజ‌వాడ నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చ‌మైన తెలుగింటి ప్రేమ‌క‌థ‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమరావ‌తి అమ్మాయిగా గ‌గ‌న న‌టిస్తుంది. సిద్ధార్థ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత బెజ‌వాడ నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ “ఈ నెల 26న లాంఛ‌నంగా చిత్రాన్ని మొద‌లుపెడ‌తాం. ఆద్యంతం అమ‌రావ‌తి ప‌రిస‌రాల్లోనే తెర‌కెక్కిస్తాం. స్వ‌చ్ఛ‌మైన తెలుగింటి ప్రేమ‌క‌థ ఇది. తెలుగుద‌నం ఉట్టిప‌డుతుంది. రెండు షెడ్యూళ్ల‌లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. జూన్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అమ‌రావ‌తి ప‌రిస‌రాల్లో సంపూర్ణంగా షూటింగ్ జ‌రుపుకునే తొలి చిత్రం మాదే కావ‌డం ఆనందంగా ఉంది. ఇందులో హీరో త‌ల్లిదండ్రులుగా సంధ్యా నాయుడు, గంభీర్ రెడ్డి న‌టిస్తారు“ అని అన్నారు.
ఈ సినిమాకు మాట‌లు: శర‌త్‌, పాట‌లు: డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, సంగీతం: అభిరామ్‌, కెమెరా: రాజు. నిర్మాత: బెజ‌వాడ నాగేశ్వ‌ర‌రావు, ద‌ర్శ‌క‌త్వం: అరుంధ‌తి శ్రీను.

To Top

Send this to a friend