అమ్మ వారసత్వం కోసం..


అమ్మ వారసత్వం కోసం తమిళనాడులో పోరు కొనసాగుతోంది. ఓ వైపు శశికళ తనే అమ్మ వారుసురాలిని చెప్పి అధికారంలోకి రావాలనుకుంది. కానీ అమ్మ జైలు కెళ్లడంతో ఆమె స్థానంలో ఆమె అనుంగ శిష్యుడిని సీఎం చేసి తన కనుసన్నల్లో తమిళనాడును ఏలుతోంది.

ఇప్పుడు హఠాత్తుగా జయలలిత మేనకోడలు దీప ఎంటర్ అయ్యింది. జయలలిత వారసురాలిని తానేనని.. ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఎంజీఆర్, జయలలిత ఫొటోలున్న పార్టీ లోగోను ఆవిష్కరించి తాను జయలలిత వారసురాలిగా రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. జయ మృతితో ఖాళీ అయిన స్తానంలో పోటీచేస్తానని దీప ప్రకటించారు.

ఇక శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం పార్టీ పెడతానని మొదట్లో చెప్పి సైలెంట్ అయ్యారు. ఆయన ఎటూ కాకుండా పోయారు. చనిపోయిన జయ లలిత ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఇలా తమిళ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వారసత్వం కోసం జరుగుతున్న ఈ పోరులో ఓ వైపు దీప, మరోవైపు శశికళ బ్యాచ్ ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ప్రజలు ఎవరినీ ఆదరిస్తారన్నది వేచిచూడాల్సి ఉంది.

To Top

Send this to a friend