అమ్మ మీద ఆన..

 

అమ్మ మీద ఆన వేసి సగర్వంగా జైలుకెళ్లింది చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకేను చీల్చడానికి కుట్రలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీలను ఎవ్వరిని వదల అంటూ శపథం చేసి మరీ జైలు బాట పట్టింది చిన్నమ్మ శశికళ..
సుప్రీంకోర్టు శశికళకు జైలు శిక్ష వేయడంతో బెంగళూరు కోర్టులో లొంగిపోవడానికి ఉదయం బయలు దేరారు. మొదట మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు వచ్చిన శశికల ఉద్విగ్నతకు లోనయ్యారు. జయ సమాధిని మూడుసార్లు కొట్టి శపథం చేసి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు.

శశికళ అమ్మ జయలలిత సమాధిని మూడు సార్లు కొట్టి ఏవో కోరుకున్నారు. అప్పుడు ఏం కోరుకున్నారనే దానిపై ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు.. అందులో ఒకటి ‘అమ్మ మనసు తన చుట్టూనే తిరుగుతుందని..’ సమాధి పై ఒకటి కొట్టారు. రెండోసారి.. ‘అమ్మ ఆశయాలను కొనసాగిస్తానని జయను మొక్కి’ రెండోసారి అమ్మ సమాధిపై శపథం చేశారు. ఇక మూడోసారి ఎరుపెక్కిన కళ్లతో జయ సమాధిపై కొట్టి ‘పార్టీని చీల్చాలని చూసేవాళ్లను ఎన్నటికీ క్షమించనని..’ శపథం చేశారామే..
ఇలా చిన్నమ్మ మూడు సార్లు జయ సమాధిపై గట్టికి కొట్టి శపథాలు చేస్తూ ఆవేశంగా కోరుకోవడం ఈరోజు హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఆమె బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లిపోయారు.

To Top

Send this to a friend