అమ్మ దైవం.. శశికళ దెయ్యం.. పన్నీర్ ప్రార్ధన ఫలించేనా..?

sasikala-pannerselvam-tn

అమ్మ జయలలితకు శాష్టాంగ పడ్డ ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం.. అమ్మ నెచ్చలి శశికళకు మాత్రం వంగి దండాలు పెట్టడం లేదు.. అమ్మ తనకు దైవం కానీ ఆమె నెచ్చలి కాదంటూ అధికారాన్ని వీడడం లేదు. ఒత్తిడి చేస్తే ఏకంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి తన పదవిని కాపాడమంటూ శరణుజొచ్చాడు. దీంతో మోడీ ఐటీ దాడులతో తమిళనాట అధికార ఎమ్మెల్యేలు, అధికారులను కొంత లైన్లోకి తీసుకొచ్చాడు. దీంతో శశికళ మంత్రులు, ఎమ్మెల్యేలతో లాబీయింగ్ మొదలుపెట్టింది. పన్నీర్ ను దించాలని ఒత్తిడి చేసింది. ప్రస్తుతం తమిళనాడు మంత్రులు ఎమ్మెల్యేలంతా అమ్మ జయలలిత స్థానంలోకి శశికళ రావాలంటూ భజన చేస్తున్నారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా శశికళను సీఎం చేయాలని లేఖరాయడం గమనార్హం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పన్నీర్ సెల్వం మాత్రం సీఎం పీఠాన్ని వీడడానికి ఇష్టపడడం లేదు. దీంతో అధికార సంక్షోభం దిశగా తమిళనాట పరిస్థితులు దిగజారుతున్నాయి.
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకేకు ఈ పరిణామాలు కలిసివస్తున్నాయి. శశికళ-పన్నీర్ సెల్వం లొల్లిలో ఓ 30 మంది ఎమ్మెల్యేలను లాగేసి అధికారాన్ని పన్నీర్-శశికళకు దక్కకుండా చేయాలని ప్రతిపక్ష నేత కరుణానిధి స్కెచ్ వేస్తున్నాడట.. ఇలా అమ్మ జయలలిత మరణంతో తమిళనాట గ్రూపులు, రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ సపోర్టుతో ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. అమ్మ జయలలిత స్థానంలోకి రావాలని శశికళ ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఇద్దరు విభేధాలతో కరుణానిధి తన వంతూ ప్రయత్నాలు చేస్తుండడం తమిళనాట రాజకీయాలను వేడిని రగిలిస్తోంది..

To Top

Send this to a friend