అమెరికా గేట్లు మూయడం సమంజసమా..?

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంపు ఏడు ముస్లిం అతివాద, తీవ్రవాద దేశాల నుంచి అమెరికాకు రావడాన్ని నిషేధించారు. ఇప్పుడు ఈ నిర్ణయం అమెరికాలోని ముస్లింలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. తమను కూడా భవిష్యత్ లో దేశం నుంచి వెళ్లగొడతారేమోనన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.

ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకునే సిరియా, అఫ్ఘనిస్తాన్ సహా పలు ఉగ్రవాద దేశాల నుంచి వలసలను ట్రంప్ నిరోధించారు. దీంతో ఆయా దేశాలనుంచి పాస్ పోర్టుల ద్వారా అమెరికాలోకి రావడానికి లేదు. అలాగే అమెరికా పక్కదేశం మెక్సికో చుట్టూ గోడ కడుతున్నారు. అక్కడినుంచి వలసలను నిరోధిస్తారు. ఇలా వేరే దేశాలనుంచి జనం రాకుండా అమెరికా ఉగ్రవాదాన్ని నిరోధించాలనకుంటోంది. కానీ అమెరికాలో ఇప్పటికే పేరుకుపోయిన ముస్లిం, ఇతర అతివాద శక్తులు దాడులకు దిగితే ట్రంప్ ఏం చేస్తారనే ప్రశ్న అక్కడి జనాలను వేదిస్తోంది..
ఇక ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. వలస వచ్చిన మేధావులతోనే అమెరికా ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని.. వారు లేకపోతే అమెరికా సమాజం లేదని వారు పునరుద్ఘాటించారు. ఇలా గేట్లు మూసేసి అమెరికాను రక్షించాలనుకుంటున్న ట్రంప్ నిర్ణయాన్ని అందరూ తప్పుపడుతున్నారు.

To Top

Send this to a friend