అమెరికాకు నో వే.. ఇక ఐటీ నిపుణులు ఇండియాలోనే..

అందరి స్వప్ణం ఒకటే.. అంరది జాబ్ ఒకటే.. అదే అమెరికాలో.. అదీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా.. అలాంటి అబ్బాయిలకే పిళ్లను ఇవ్వడానికి ఇక్కడ జనం ఎగబడతారు.. కానీ మరికొన్ని సంవత్సరాల్లో అసలు అమెరికాలో మన ఇండియన్సే ఉండరు.. ఉంటారు కానీ వారికి జాబ్ లు ఉండవు.. సాఫ్ట్ వేర్ జాబులు దొరకవు.. ఎందుకంటారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

అధికారం మారితే ఆ దేశప్రజల తలరాతలే మారిపోతున్నాయి.. రాజు మారితే రాజరికం మారిపోతోంది.. అమెరికా ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న వారి ఆశల నాయకుడు.. తన వరాల మూట విప్పేందుకు రెడీ అవుతున్నాడట .. జనవరి చివరి వారంలో గద్దెనెక్కనున్న అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ తన నూతన పాలసీలను రూపొందిస్తున్నారట.. ఇన్నాళ్లు అమెరికా ఉద్యోగాలను కొల్లగొట్టి ఎగరేసుకుపోతున్న ఇండియా, చైనా ఐటీ నిపుణులకు ఇక దేశంలోకి ఎంట్రీనే ఇవ్వడట.. కఠిన హెచ్1బీ వీసాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడట.. అంతేకాదు.. స్థానికులకే ఉద్యోగాలివ్వాలని నిబంధనలను రూపొందిస్తున్నాడు.. అందులో భాగంగా విద్యార్హత తగ్గింపుతో పాటు.. దేశంలోని అందరికీ లక్ష డాలర్ల సమాన వేతానాన్ని అమలుచేయాలని నిర్ణయించారట.. తద్వారా విదేశాల్లో తక్కువకు దొరికే మ్యాన్ పవర్ కు కూడా భారీగా జీతాలివ్వాలల్సిందే.. దానికోసం కంపెనీలు విదేశాల్లోని వ్యక్తులను చూడకుండా దేశంలోని వారికే అవకాశం కల్పిస్తారు.. అందుకే డొనాల్డ్ ట్రంప్ వేసిన ఈ ప్లాన్ తో ఇండియా , విదేశీ కంపెనీలన్నీ మూతపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదంటే స్థానికులే ఉద్యోగాలివ్వాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. తక్కువ జీతాలకు విదేశీయులు చేసినట్టు అమెరికన్లు చేయలేరు.. బయటి నుంచి మంచి ఉద్యోగులు దేశంలోకి రారు.. కనుక ఉత్పత్తి, వినియోగిత పై ప్రభావం పడి కంపెనీలు నష్టపోవడం ఖాయం..కానీ అమెరికన్లకు మాత్రం ఇలాగైనా ఉద్యోగాలు దక్కుతాయన్నమాట..

అమెరికాలో అత్యధిక వేతనాలు పొందేది.. హెచ్ 1 బీ వీసాలు పొందేది భారతీయులే.. అమెరికా కంపెనీలైన కాగ్నిజెంట్, ఐబీఎం తదితర ఫేమస్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో భారతీయులే అధికం.. ట్రంప్ వీసాల రద్దుతో భారతీయ కంపెనీలు, తక్కువ వేతనాలు ఇచ్చే కంపెనీలపై ఆర్థిక భారంపడి అవి మూతపడడం ఖాయం.

To Top

Send this to a friend