అమాయక జనాలని భయపెడుతున్న ఫోన్ నంబర్..?

కొద్దిరోజులుగా వాట్సాప్, ఫేస్ బుక్ లలో ఒక మేసేజ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.. 7787889999 లాంటి నెంబర్ నుంచి కాల్ వస్తే ఎత్తకూడదంట అందరూ భయపెడుతున్నారు .. ఆ ఫోన్ ఎత్తితే ఫోన్ పేలిపోయి చచ్చిపోతున్నారు అంటూ వైరల్ అవుతోంది. మీ ఫోన్ హ్యాక్ అవుతుందని. . మీ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అవుతుందని చెప్పి మెసేజ్ తో అందరినీ భయపెడుతున్నారు. ఆ నంబర్ ఎవరిదో కానీ కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఆ నంబర్ వ్యక్తులు బలి అయిపోతున్నారు..
జనంలో పిచ్చి పీక్స్ కి వెళ్లడం అంటే అదే అనుకుంట పనికిమాలిన పుకార్లతో భయపెట్టే పోస్టులను వేలాది మంది షేర్స్ కామెంట్స్ చేస్తుంటారు.. కానీ ఎవ్వరికైనా అవగాహన కలిగించేలా అసలు నంబర్ నకిలీదా.. ఒరిజినలా..? నంబర్ ఎత్తితే ఏమవుతుందనే డైర్యాన్ని ఎవ్వరూ ఇవ్వడం లేదు.. చదువుకున్న వారు ఇంతో అంతో అవగాహన ఉన్న వారు కుడా కనీసం ఇతరులకు నిజాన్ని షేర్ చెయ్యాలన్న బాధ్యతగా వ్యవహరించడం లేదు . మన వీక్‌‌నెస్‌ని గమనించి కట్టుకధలు.. మనలోని అమాయకత్వాన్నీ, చాలా మంది క్యాష్ చేసుకుంటునాన్నరు . మనం ఎదో గొప్పపని చేస్తున్నానని గుడ్డిగా భయాలను సృష్టిస్తున్నారు.. జనాల చెవుల్లో పూలు పెడుతూ రోజూ కొత్తవి సృష్టిస్తూ ఆడుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.. అవన్నీ వట్టివే అని గుర్తించండి..

To Top

Send this to a friend