అభిమాని హీరోతో పవన్ పంచెకట్టుతో..

తెలుగు హీరోల్లో పవన్ అంటే పడిచచ్చే నితిన్ ఆ అభిమానాన్ని అవసరం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తుంటారు. పవన్ కూడా తన ఫాంహౌస్ లో పండిన మామిడి పళ్లను బుట్టలో పెట్టి తన ప్రియమైన అభిమానులకు ప్రతి ఏటా పంపుతుంటారు. నితిన్ కు అయితే ఖచ్చితంగా ఈ పళ్ల బుట్ట ప్రతిఏటా వస్తూనే ఉంటుంది. ఇక పవన్ సినిమా ఏది రిలీజ్ అయినా కూడా నితిన్.. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డిలు నైజాం హక్కులు పొంది దాన్ని పంపిణీ చేస్తుంటారు. అందులో భాగంగానే పవన్ లేటెస్ట్ సినిమా కాటమరాయుడు హక్కులు కూడా 20కోట్లు చెల్లించి నితిన్ దక్కించుకున్నాడు. ఇలా సినిమా జయాపజాయాలతో సంబంధం లేకుండా నితిన్-పవన్ అనుబంధం కొనసాగుతూనే ఉంటోంది.

ఇటీవల కాటమ రాయుడు షూటింగ్ స్పాట్ లో సడన్ గా నితిన్ ప్రత్యక్ష మయ్యాడు. అప్పటికే షూటింగ్ లో పంచెకట్టు, లాల్చీతో ఉన్న పవన్, అలీ, శివబాలాజీ తదితర నటులను కలిసి నితిన్ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాటమరాయుడి స్టిల్స్ ఇలా బయటపడ్డాయి. మొత్తానికి నితిన్ వల్ల సినిమాలో పవన్ గెటప్ న ప్రేక్షకులు ముందుగానే చూడగలిగారు.

To Top

Send this to a friend