అభిమానిపై చేయిచేసుకున్న బాలయ్య!

బాలయ్య బాబు.. సినిమాలోలాగేనే బయట తన ఆగ్రహాన్ని చూపించాడు.. ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఆ వీడియో కాప్చర్ కావడంతో అడ్డంగా బుక్కయ్యాడు.. అభిమానం హద్దుల్లో ఉండేవరకే అని బాలయ్య నిరూపించాడు.. అభిమానులు తెప్పించిన చిరాకుకు చిరాకుపడి తప్పిదం చేశారు..
గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ప్రమోషన్ లో భాగంగా బాలయ్య థియేటర్లకు వెళ్లి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా విజయవాడలోని ఓ థియేటర్లో సినిమా చూశాక బయటకు వచ్చిన బాలయ్యకు ఈ అనుభవం ఎదురైంది. లోపల అమ్మాయిలు పిలిస్తే లేచి నిలబడి సెల్ఫీకి ఫోజిచ్చిన బాలయ్యతొ బయటకు వస్తుండగా ఓ యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతడి చేయిని విసిరేశాడు బాలయ్య.. ఆ విసురుడుకు యువకుడి సెల్ ఫోన్ కిందపడి పగిలిపోయిందట.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా మారింది..
దీన్ని షేర్ చేస్తూ అభిమానులు.. బాలయ్యపై సెటైర్లు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నటసార్వభౌమ నందమూరి తారకరాముడి కుమారుడిగా నటనలోనూ, రాజకీయంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ.. అభిమానులతో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. కొందరైతే అమ్మాయిలకు సెల్ఫీలు ఇచ్చి అబ్బాయి అడిగితే ఇవ్వరా అని మండిపడుతున్నారు.
బాలయ్య అభిమానిపై చేయి చేసుకున్న వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend