అబద్ధం.. ఆ నోటినుంచి అబద్ధం..

‘లక్ష ఉద్యోగాలు.. ఇంటికొక ఉద్యోగం.. ’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక కేసీఆర్ హామీలివి.. వాటినే కదా కోదండరాం.. జేఏసీ నాయకులు , నిరుద్యోగులు అడుగుతున్నారు… కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే కదా.. నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు.. అంతమాత్రానికే కేసీఆర్ జులుం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మండలాల్లో ఆందోళనల్లో పాల్గొనడానికి వెళుతున్న నిరుద్యోగులు, జేఏసీ నాయకులను ముందుస్తు అరెస్ట్ లు చేసి ఉద్యమాన్ని తొక్కేశారు. అంతేకాదు జేఏసీ నాయకుడు కోదండరాం ఇంట్లో తలుపులు పెట్టుకొని పడుకుంటే తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు పగులకొట్టి మరీ దొంగల్లాగా చొరబడిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంపై తెలంగాణ సమాజం మొత్తాన్ని నివ్వెరపరిచింది. దీనికోసమేనా తెలంగాణ సాధించింది అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలు కోదండరాంను పెద్ద గా చేస్తుంది కేసీఆర్.. ఆయన మానాన ఆయన ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈనిరుద్యోగ ర్యాలీని కూడా లైట్ తీసుకుంటే ఆయన్ను ఎవరూ పట్టించుకునే వారే కాదు.. కోదండరాం నిరుద్యోగుల ర్యాలీ తీసి ఊరుకునేవారు. కేసీఆర్ ఎలాగూ ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు వేయడంతో అంతా నిశ్శబ్ధంగా ఈ ఉద్యమం గడిచిపోయింది. కానీ కేసీఆర్ చేసిన పెద్ద తప్పు కోదండరాంపై నిరుద్యోగులపై పోలీస్ చర్యకు దిగడం.. అది మీడియా హైలెట్ చేయడంతో నిరుద్యోగులు, ప్రజల కడుపు మండి వివాదం పెద్దది అయ్యింది.
కేసీఆర్ ఏం తక్కువ తినలేదు.. అది నాలుకో తాటిమట్టో తెలియనట్టు అసెంబ్లీ సాక్షిగా అబద్దమాడాడు.. లక్ష ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగమని ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తున్నాయి. కేసీఆర్ హామీలిచ్చి ఇప్పుడు నెరవేర్చడం లేదని నెటిజన్లు కేసీఆర్ వీడియోలను సర్క్కూలేట్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్ అబద్దాలాడుతూ లక్ష ఉద్యోగాల హామీని గంగలో కలిపేశాడని మండిపడుతున్నారు.
కేసీఆర్ ఎన్నికల ముందు.. ఆ తర్వాత ఉద్యోగాలపై మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend