అప్పుడు ‘తెలుగోళ్ల’ది.. ఇప్పుడు తమిళోల్ల పరువు..

తెలంగాణ బిల్లు.. భారతదేశ పార్లమెంటులోనే అత్యంత ఉత్కంఠభరితంగా.. నాటకీయ పరిణామాల మధ్య పాస్ అయ్యింది. ఎంపీలు కొట్టుకోవడాలు.. తిట్లు శాపనార్థాలు, నిరసనలు.. చివరకు పెప్పర్ స్ర్పేలు లాంటివి జరిగి తెలుగు వారి పరువును దేశవ్యాప్తంగా తీశాయి. పార్లమెంటు సాక్షిగా జరిగిన తెలంగాణ బిల్లు లొల్లిలో తెలుగు ఎంపీల చేష్టలు అందరిని విస్మయానికి గురిచేశాయి…

ఇక అక్కడికి కట్ చేస్తే తెలుగు వారి పరువు ఢిల్లీలో పోయినట్టే.. తమిళ వాళ్ల పరువు చైన్నై సాక్షిగా అభాసుపాలైంది. జయలలిత లాంటి దిగ్గజ నేత మరణం తమిళనాడునే అల్లకల్లోలం చేసింది. వైఎస్ చనిపోయాక ఏపీ ఎలా అయితే నాయకత్వ లోపంతో కుదేలైందో.. అంతకుమించి అమ్మ జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శశికళ-పన్నీర్ ల రాజకీయ సంగ్రామం.. చివరకు ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ పన్నాగంతో తమిళనాడు పరువు చైన్నై సముద్రంలో కలిసింది. దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలు.. అధికారం కోసం సిగపట్లు.. అసెంబ్లీలో గలాటాను చూసి జనం నవ్వుకుంటున్నారు. అమ్మ జయలలిత ఉండగా కిమ్మనకుండా ఉన్న నాయకులు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చొక్కాలు చిప్పుకుంటున్న వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది. తెలంగాణ బిల్లుతో తెలుగోళ్ల పరువు.. జయం మరణంతో అధికారం కోసం కొట్టుకుంటున్న తమిళుల పరువు దేశవ్యాప్తంగా పోయింది. ఉత్తరాది ఆధిపత్యం బలంగా ఉన్న వేళ.. మోడీ లాంటి బలమైన నేతల ఆటలకు దక్షిణాది కకావికలమవుతోంది. కేంద్రం ఆడిస్తున్న ఆటలకు అప్పుడు తెలుగోళ్లు.. ఇప్పుడు తమిళోళ్లు కొట్టుకుంటున్నారు..

To Top

Send this to a friend