ఇదో విచిత్రం.. అప్పట్లో శ్రీదేవి దిగ్గజ ఏఎన్నార్ తో పాటు అనంతరం ఆయన కుమారుడు నాగార్జునతో కూడా ఆడిపాడింది. నటనలో భాగంగానైనా ఇదో సంచలనమే అయ్యింది. కళామతల్లికి నటనకు సంబంధం లేదని ఎందరు చెప్పుకున్నా కూడా తండ్రితో ఆడి కొడుకుతో ఆడిన హీరోయిన్ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది..
ఇప్పుడు అదే రిపీట్ అయ్యింది.. చిరంజీవి 150 సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. అంతకుముందు కాజల్ చిరు మేనల్లుడు అల్లు అర్జున్ తో పాటు కొడుకు రాంచరణ్ తో కలిసి నటించింది. అప్పట్లో తండ్రితో పాటు కొడుకుతో నటించిన హీరోయిన్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో ట్రైన్ రివర్స్ అయ్యింది. ముందు కొడుకుతో ఆ తర్వాత తండ్రితో ఆడిపాడిన భామగా కాజల్ చరిత్రలో నిలిచిపోయింది.. ఈ విషయాన్ని చిరంజీవి తన 150 సినిమా విడుదల ముందు సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు
