అప్పుడు కేసీఆర్ కు ఇప్పుడు చంద్రబాబుకు షాక్..


చంద్రబాబు పరపతి ఢిల్లీలో పనిచేయడం లేదు.. ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు షాక్ ఇచ్చారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో చంద్రబాబు ఎంత బతిమిలాడినా కేంద్రంలోని పీఎంవో అధికారులు ససేమిరా అన్నారు.. దీంతో చంద్రబాబు మనస్తాపం చెందినట్టు సమాచారం..

ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం మంగళవారంతో ముగిస్తోంది. దీనిపై స్వయంగా చంద్రబాబు కలుగ జేసుకొని మరో టక్కర్ కు మరో మూడు నెలల పొడగింపు ఇవ్వాలని కోరారట.. కానీ ఆయనకు ఇదివరకే పీఎంవో అధికారులు ఆరు నెలల పదవీకాలన్ని పొడగించారు. దీంతో ఇవ్వడం సాధ్యంకాదని.. ఆయన పదవీ విరమణ చేయడం ఖాయమని తేల్చారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తి నియమించుకోవాలని సూచించారు. దీంతో చంద్రబాబు టక్కర్ స్థానంలో అజయ్ కల్లంను నియమించాలని నిర్ణయించి పీఎంవోకు తెలియజేశారు. దానికి పీఎంవో అధికారులు నో చెప్పారట.. ఎందుకంటే కల్లం మార్చి నెలాఖరుతో రిటైర్ కాబోతున్నారట.. దీంతో నెలలో రిటైర్ అయ్యే వ్యక్తిని సీఎస్ ను చేసి మళ్లీ పొడగించడం ఎందుకని ఆయన నియామకాన్ని రద్దు చేసిందట.. చంద్రబాబు కల్లంను నియమించి ఓ ఆరునెలల పొడిగింపును కోరదామని అనుకున్నారట.. కేంద్రం నిర్ణయంతో హతాషుడైన చంద్రబాబు నిన్న కేబినెట్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీపై వాపోయారట..

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. రాజీవ్ శర్మ రిటైర్ మెంట్ తర్వాత సతీష్ చంద్రను సీఎస్ ను చేశారు. ఆయన పదవీకాలం నెలరోజులే ఉన్నా కేసీఆర్ పొడిగింపు కోరదామని నిర్ణయించి సీఎస్ ను చేశారు.కానీ ఆయనకు పీఎంవో అధికారులు పొడిగింపు ఇవ్వకపోవడంతో నెలరోజల సీఎస్ గా ఆయన అవమానకర రీతిలో దిగిపోయారు. కేసీఆర్ కు ఈ విషయంలో షాక్ ఇచ్చిన పీఎంవో పెద్దలు చంద్రబాబు ఏకంగా ముందుగానే నో చెప్పి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

To Top

Send this to a friend