అన్నయ్య చిరు ఇంటికి పవన్

చిరంజీవి 150 వ సినిమా ప్రిరీలిజ్ ఫంక్షన్ నుంచి ఒకటే చర్చ.. పవన్ రాలేదంటూ అందరూ ఆడిపోసుకున్నారు. ఆయన అభిమానులు నొచ్చుకున్నారు. అన్నాదమ్ముల మధ్య విభేదాలన్నారు. వివిధ ఇంటర్వ్యూల్లో కూడా మెగా ఫ్యామిలీ అందరూ వచ్చి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు రాలేదనే ప్రశ్న.. కానీ అప్పుడే చిరంజీవ సమాధానం చెప్పారు. పవన్ కు ఇలా బహిరంగ సభల్లో, మీటింగ్ లలో అందరితో కలిసిపోవడం ఇష్టం ఉండదని.. అందుకే రాలేదని సెలవిచ్చారు. పవన్ కు ఉన్న స్వభావం తాను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడని చిరు చెప్పుకొచ్చారు. పవన్ రాకపోయినా ట్విట్టర్ లో విషెస్ చెప్పిన విషయాలను గుర్తు చేశారు..

కానీ ఎట్టకేలకు తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లాడట.. ఇద్దరి మధ్యా సినిమా, రాజకీయాలపై చర్చ జరిగిందని సమాచారం. త్వరలోనే చిరంజీవి తన ఖైదీ హిట్ అయినందుకు అభిమానులకు కృతజ్ఞత సభ నిర్వహించాలనుకుంటున్నారు. దానికి రావడానికి పవన్ ను మెగా ఫ్యామిలీ ఈ బేటిలో ఒప్పించినట్టు సమాచారం. పవన్ తో కలిసి రాత్రి డిన్నర్ మీటింగ్ నిర్వహించిన చిరు ఈ మేరకు తమ్ముడితో అప్యాయంగా మాట్లాడినట్టు సమాచారం. చిరు 150 వ సినిమా హిట్ అయినందుకు పవన్ అన్నయ్యను అభినందించారని తెలిసింది.. ఇలా అన్నా తమ్ముడు కలిశారనే వార్తతో అటు మెగా ఇటు పవర్ స్టార్ అభిమానులు కుషీగా ఉన్నారు..

To Top

Send this to a friend