అన్నయ్యకు 12 కోట్లు.. తమ్ముడికి 12.5 కోట్లు


అన్నదమ్ములు అదరగొట్టారు. మెగాస్టార్ చిరు, తమ్ముడు పవన్ కళ్యాణ్ ల సినిమా లు భారీ ధరకు అమ్ముడుపోయాయి. మెగాస్టార్ దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత తీసిన చిత్రం ఖైదీనంబర్ 150. ఈ మూవీ రిలీజ్ అయ్యి దుమ్మురేపే వసూళ్లు సాధించింది. దాదాపు 160 కోట్లు కొల్లగొట్టినట్టు టాక్.. ఎంతలేదన్న సినిమా కు 50 కోట్ల ప్రాఫిట్ మిగిలిందని సమాచారం.

తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన రాంచరణ్ కు నాన్న సినిమాతో లాభాల పంట పండింది.. ఇప్పుడు మరో 12 కోట్లు ఖైదీకి వచ్చిపడ్డాయట.. మెగాస్టార్ స్టామినాను వినియోగించుకోవాలని స్టార్ మాటీవీ ఖైదీ సినిమా శాటిలైట్ రైట్స్ ను కళ్లు చెదిరే రేట్లకు కొనుగోలు చేసిందట.. దాదాపు 12కోట్లు ఈ సినిమా హక్కులకు వెచ్చించిదట.. దీంతో రాంచరణ్ కు ఇప్పుడు వచ్చిన సొమ్ము అదనమే అన్నమాట.. హీరో గా కంటే రాంచరణ్ నిర్మాతగా మారి తీసిన తొలిచిత్రమే అతడికి కోట్లు తెచ్చిపెట్టడం విశేషం..

ఇక కాటమరాయుడు పవన్ ఏమీ తక్కువ తినలేదు.. పవన్ కళ్యాన్ సినిమా విడుదలకు ముందే ఓ తెలుగు చానల్ ఈ మూవీని కొనేసిందట.. తమిళ వీరం రిమేక్ కావడంతో ఆ సినిమా ను చూసి ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని నమ్మి పవన్ కొత్త సినిమాను ఏకంగా విడుదలకు ముందే 12.5కోట్లు చెల్లించి కొనుగోలు చేయడం గమనార్హం. ఇలా చిరంజీవి సినిమా విడుదలయ్యాక కోట్లు కొల్లగొడితే.. పవన్ కళ్యాన్ సినిమా విడుదలకు ముందే మాంచి మార్కెట్ సాధించి కోట్లు సంపాదిస్తుండడం విశేషం.. ఎంతైనా అన్నదమ్ముల స్టామినాకు రికార్డులు, రివార్డులతో పాటు డబ్బులు వచ్చిపడుతున్నాయి.

To Top

Send this to a friend