అనుష్క సైజ్ పై రాజమౌళి నిజాలు..


బాహుబలి సినిమాలో ప్రధాన హీరోయిన్ అనుష్కనే.. ఆమె మొదటి పార్ట్ లో డీగ్లామర్ పాత్రలో తల్లిగా నటించింది. కానీ రెండో పార్టులో ఆమె మెయిన్ హీరోయిన్.. కానీ షూటింగ్ జాప్యంతో అనుష్క సైజ్ జీరో పేరిట ఓ ప్లాపు ప్రయోగం చేసి భారీగా బరుపు పెరిగి కష్టాలు తెచ్చుకున్నారు. ఆ బరుతో గ్లామర్ పోయి సైజ్ తగ్గక మళ్లీ బాహుబలి షూటింగ్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజమౌళి –అనుష్క ఎంత ప్రయత్నించినా రాణిలా అనుష్క తయారుకాలేదు. దీనిపై ఎన్నో ఊహాగానాలు వెల్లడైన నేపథ్యంలో అనుష్క విషయంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
మహాశివరాత్రి సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. సైజ్ జీరో తో బరువు పెరిగిన అనుష్క మళ్లీ ఆ స్థాయిలో తగ్గలేదని.. అందుకే కొంత కంప్యూటర్లో ఆమె సైజ్ ను టెక్నాలజీ సాయంతో తగ్గించేశామన్నారు. అనుష్క మొదటి పార్ట్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశామని మిగిలిన పాత్రకు మాత్రం కంప్యూటర్ లో సన్నగా తయారు చేశామన్నారు. దీంతో అనుష్క బరువు-బాహుబలి షూటింగ్ కు అవంతరాలు అన్న ఊహాగానాలు నిజమేనని రాజమౌళి ఒప్పుకున్నట్టు అయ్యింది.

To Top

Send this to a friend