అధికారమే లక్ష్యంగా బాబు పెద్ద అడుగు..


చంద్రబాబు మహా స్కెచ్ వేశాడు.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నాడు. అదీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలే ఉందనగా అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని చంద్రబాబు నిన్నటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతను బట్టి నెలకు వెయ్యి నుంచి రూ.2వేల వరకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. నిరుద్యోగులతో సమాజ సేవ చేయిస్తూ చేయూతనివ్వాలని నిర్ణయించారు.
రాజకీయంగా ప్రధానమైన వర్గం యువత.. వారే అందరినీ మోటీవేట్ చేస్తుంటారు. తెలంగాణలో ఉద్యోగాలివ్వకపోవడంతో ఎంత లొల్లి జరుగుతుందో అందరికీ తెలిసిందే.. అందుకే బాబు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కేబినెట్ సమావేశంలో నిరుద్యోగ భృతిని ప్రకటించారు. ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం అమలు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ, ఆపైన చదువుకున్న యువతకు ఉపాధి సంపాదించుకునే వరకు భృతిని ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఈ అతిపెద్ద నిర్ణయం చంద్రబాబు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తీసుకున్నారు. మెజార్టీ స్థానంలో కీరోల్ వంటి యువతను పడితే వారితోనే అందరి ఓట్లు పడతాయని.. భావించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.. ఈ ఒక్క నిర్ణయం బాబున వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తుందో లేదో వేచిచూడాలి..

To Top

Send this to a friend