అద్వానీకి సన్యాసం.. సుష్మకు అగ్రపీఠం..


నరేంద్రమోడీ.. ఏకచత్రాధిపత్యంలో బీజేపీ బంధీ అయిపోయింది. గుజరాతీ ద్వయం ముందు బీజేపీ కురువృద్ధులు సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అమిత్ షా-నరేంద్రమోడీ మొత్తం దేశాన్ని గెలవడమే కాదు.. బీజేపీలో వాజ్ పేయి తర్వాత నంబర్ 2 అయిన అద్వానీకే ఎసరుపెట్టేశారు. ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం అవుతోంది. బీజేపీ తరఫున మోడీ ప్రధాని అయ్యాక సీనియర్ అయిన అద్వానీకి ఏ పదవి ఇవ్వలేదు. అందరూ అద్వానీని రాష్ట్రపతిని చేస్తారని అందరూ అనుకున్నారు. మోడీకూడా మొదట అలాంటి సంకేతాలే ఇచ్చారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలిసింది..
అమిత్ షా లేటెస్ట్ గా తయారు చేసి రాష్ట్రపతి నామినేటింగ్ జాబితాలో బీజేపీ కురు వృద్ధుడు అద్వానీ పేరులేకపోవడం బీజేపీ శ్రేణులను విస్మయపరిచింది. అమిత్ షా లిస్ట్ లో మురళీ మనోహర్ జోషీ, సుష్మ స్వరాజ్, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ల పేర్లు మాత్రమే ఉన్నాయట.. దీంతో అగ్రపీఠం రాష్ట్రపతిపై ఆశలు పెంచుకున్న అధ్వానీకి ఇది శరాఘాతంగా మారింది.
దేశంలో మోడీ హవా పెరిగింది. కొత్తరక్తం వస్తోంది. మోడీ తన కేబినెట్ లో 70 నిండినవారిని తీసుకోలేదు. అందుకే అప్పుడు అధ్వానీని పక్కనపెట్టిన మోడీ ఆ తదనంతరం రాష్ట్రపతిని చేస్తారని భావించారు.కానీ ఇప్పుడు ఆ అత్యున్నత పదవిని కురువృద్ధుడికి ఇవ్వకపోవడంపై బీజేపీ శ్రేణుల్లోనే కాదు యావత్ దేశంలోనే విస్మయం వ్యక్తం అవుతోంది.

To Top

Send this to a friend