అజిత్ వెంట పడ్డ పవన్ కళ్యాన్


కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వెళితే అది హిట్ అవుతుందో లేదో గ్యారెంటీగా చెప్పలేం.. కానీ ఇదివరకు ఎక్కడో ఓ చోట ఆడిన సినిమా అయితే మనకు ఫలితం ముందే కళ్లముందు కనపడుతుంది. ఆ కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అందుకే తెలుగు అగ్రహీరోలందరూ రిమేక్ ల బాట పట్టారు. కొత్త కథలతో చేతులు కాల్చుకోకుండా హిట్ కథలనే ఎంచుకొని విజయం సాధిస్తున్నారు.

ఈ మధ్యే ధ్రువ సినిమాతో రాంచరణ్ హిట్ కొట్టారు. అదీ తమిళ కథనే.. ఇప్పుడు పవన్ కళ్యాన్ తీస్తున్న కాటమరాయుడు కూడా తమిళంలో అజిత్ హీరోగా నటించి హిట్ కొట్టిన వీరం మూవీనే.. ఆ సినిమాలకే కొంచెం కమర్షియల్ హంగులు జోడించి తెలుగులో విడుదల చేసి హిట్ కొడుతున్నారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తర్వాత మూవీని కూడా రిమేక్ నే ఎంచుకున్నారు. తమిళంలో విజయం సాధించిన వేదాళంను తెలుగులో ఏఏం రత్నం నిర్మాతగా తీస్తున్నారు. వేదాళం డైరెక్టర్ నే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పవన్ రీసెంట్ గా మరో సినిమాపై కన్నేశాడు..

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, తరువాత చేయబోయే వేదాళం మూవీలు రెండు తమిళ అగ్రహీరో అజిత్ చేసినవే. ఆ రెండింటికి శివనే దర్శకుడు.. దీంతో వీరిద్దరి(అజిత్-శివ) కాంబినేషన్ లో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న మరో కొత్త సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా పేరు ‘వివేగమ్’ ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వివేగమ్ హిట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఆగస్టులో విడుదలయ్యే ఈ సినిమాను కూడా పవన్ రీమేక్ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో పవన్ వరుసగా అజిత్ సినిమాలనే రీమేక్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అజిత్ కూడా తన వయసుకు తగ్గ కథలను ఎంచుకోవడంతో పవన్ కు ఇది సూట్ అవుతోంది. ఇలా పవన్ అజిత్ ను ఫాలో అవడం వరుసగా మూడు సినిమాలతో కొనసాగుతోంది..

అజిత్ నటించిన వివేగమ్ తమిళ్ ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend