అగ‌ష్టు 13న సుప్రీమ్ హీరో సాయి ధ‌రమ్ తేజ్ ‘తిక్క’

thikka-apnewsonlinein 
హ్యాట్రిక్ స‌క్స‌ెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్‌ తేజ్, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా జంట‌గా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, డాక్ట‌ర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌గా శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందిస్తున్న చిత్రం ‘తిక్క’  చిత్రం ల‌డ‌క్ లో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జులై 20న మెద‌టి లుక్ టీజ‌ర్‌ని విడుద‌ల చేసి,ఎస్‌.థ‌మ‌న్ సంగీత సారథ్యంలో అందించిన సూప‌ర్బ్‌ ఆడియో ని జులై 30న‌ గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు  పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రాన్ని అగ‌ష్టు13న‌ విడుద‌ల చేయ‌టానికి నిర్మాత డాక్ట‌ర్.సి.రోహిణ్ రెడ్డి  స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్న ‘తిక్క’ చిత్రం ల‌డ‌క్ లో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. దీంతో షూటింగ్ కార్య‌క్ర‌మాలు మెత్తం  పూర్తిచేసుకుంది. ఇటీవ‌ల విడుద‌ల‌యిన‌ మోష‌న్ పోస్ట‌ర్ ట్రెండ్ అవ్వ‌టం ఆనందంగా వుంది. అలాగే జులై 20న మెద‌టి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తాము. అలాగే ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ అందించిన ఆడియోని జులై 30న మెగాఅభిమానుల స‌మక్షంలో విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం అభిమానుల‌తోపాటు అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రానికి సునీల్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. మా హీరో సాయి ధ‌ర‌మ్‌ తేజ్ ఎనర్జీ కి స‌ర‌పోయో ఆడియో థ‌మ‌న్ అందించాడు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు 13న విడుద‌ల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.
న‌టీన‌టులు.. 
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ న‌టించ‌గా..
 
 
టెక్నిషియ‌న్స్‌..
నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి,
ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి,
స‌హ‌నిర్మాత‌-కిర‌ణ్ రంగినేని,
కెమెరా- కె.వి.గుహ‌న్‌
సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిట‌ర్‌- కార్తీక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌- కిర‌ణ్ కుమార్‌
క‌థ‌- షేక్ దావూద్‌
మాట‌లు- హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌
డాన్స్‌- ప్రేమ్ ర‌క్షిత్‌
యాక్ష‌న్‌- విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, రామ్‌-లక్ష్మ‌ణ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా.
To Top

Send this to a friend