అగ్రిగోల్డ్ పోయి.. స్పీకర్ వీడియో వచ్చే..


అరే బాప్ రే.. వైసీపీ ఎలా ఇరికిస్తోంది.. ప్రతిపక్షం అంటే నిజంగా వైసీపీనే.. ఏపీ అసెంబ్లీలో అధికర టీడీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది.. రోజుకో అవినీతి అంశం.. రోజుకో అక్రమం అసెంబ్లీలో లేవదీస్తూ పరేషాన్ చేస్తోంది..

ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్ భూముల అక్రమాలు, రాజధానిలో రైతులను మోసం చేసిన తీరు.. భూముల కొనుగోళ్లలో మంత్రి పత్తిపాటి పుల్లారావు అంశాన్ని ప్రధానంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రస్తావించారు. దీంతో మంత్రి పత్తిపాటి లేచి నిరూపిస్తే రాజకీయాలను తప్పుకుంటానని లేదంటే జగన్ తప్పుకుంటాడా అని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించారు.

ఈ వ్యవహారంపై టీడీపీ ప్రభుత్వానికి మచ్చ తెస్తుందని భావించిన చంద్రబాబు చక్రం తిప్పారు. ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వ్యూహాత్మకంగా స్పీకర్ ను సాక్షి టీవీ చానల్ అవమానించిందనే అంశాన్ని సభా దృష్టికి తెచ్చారు.. అగ్రిగోల్డ్ అంశాన్ని కావాలనే డైవర్ట్ చేశారని ఆరోపిస్తూ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం టీడీపీ స్పీకర్ మహిళల గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించలేదని నిరూపించేందుకు ఆ నాడు మాట్లాడిన మాటల వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. తనను బ్లెయిమ్ చేశారని.. తాను అలా అనలేదని స్పీకర్ సభలో ప్రస్తావించారు..

ఇక వాకౌట్ చేసిన జగన్ మీడియాతో బయట అగ్రిగోల్డ్ అక్రమాలను, టీడీపీ మోసం చేస్తున్న తీరును విలేకరులకు వివరించి ఎండగట్టారు. అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు స్పీకర్ మహిళలపై మాట్లాడిన అంశంపై సభలో చర్చకు పెట్టారని జగన్ ఆరోపించారు.

జగన్ బయట మీడియాతో మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend