అఖిల్ పెళ్లి కాన్సల్..? నాగార్జున అప్సెట్


పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి పెటాకులైందన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అన్ని ప్రసారమధ్యమాలు, వెబ్ సైట్లలో హోరెత్తుంతుడడం.. దానికి కారణాలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

ఇటీవలే అక్కినేని అఖిల్.. బడా పారిశ్రామిక వేత్త జీవీకే సంస్థల యజమాని మనవరాలు శ్రీయభూపాల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. వచ్చే మే నెలలోనే వీరి వివాహం ఇటలీలో చేస్తామని నాగార్జున-జీవీకే ఫ్యామిలీలు ప్రకటించాయి. అయితే ఆశ్చర్యకరంగా అఖిల్-శ్రియా పెళ్లి రద్దు అయ్యిందన్న వార్త సంచలనం రేపింది.

అక్కినేని అఖిల్, ఆయన కాబోయే భార్య శ్రియాల మధ్య విభేదాలే పెళ్లి పెటాకులు కావడానికి కారణమని తెలిసింది. అభిప్రాయ బేధాలు రావడంతో ఇద్దరు తాము పెళ్లి చేసుకోబోము అని ప్రకటించారని తెలిసింది. ఈ విషయం తెలిసే నాగార్జున బాగా అప్ సెట్ అయ్యారని ఆయన సన్నిహితులు తెలిపారు. అందుకే నాగ్ .. వారం రోజులుగా అన్ని ప్రొగ్రాంలు రద్దు చేసికొని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని సన్నిహితులు తెలుపుతున్నారు. అఖిల్ సినిమా కెరీర్ ఇప్పటికే ప్లాపులతో నడుస్తోంది. మొదటి సినిమా అఖిల్ పెద్ద డిజాస్టర్ కావడం.. ఇప్పుడు పెళ్లి కూడా రద్దు కావడంతో నాగార్జున డిప్రెషన్ కు గురి అయినట్టు సమాచారం. అందుకే నాగార్జున ప్రస్తుతం మీడియాకు ఎవ్వరికీ దొరక్కుండా ఇంట్లోనే ఉంటున్నాడట.. నాగార్జున లైఫ్ లోనూ ఇలానే జరిగింది. మొదటి భార్యతో విడాకులై.. అమలతో ప్రేమ పరిణయానికి దారితీసింది. ఇప్పుడు అఖిల్ ది నిశ్చితార్థం అయ్యి పెళ్లి రద్దు కావడంతో తండ్రి బాటే.. కొడుకు కు వచ్చిందా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

To Top

Send this to a friend